-నిడదవోలు వయా ధవళేశ్వరం పల్లె వెలుగు బస్సులకు మార్గం సుగమం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తాడేపల్లిగూడెం , నిడదవోలు డిపోలకు చెందిన పల్లె వెలుగు బస్సులు ధవళేశ్వరం బ్యారేజ్ మీదుగా వాడపల్లి, రాజమహేంద్రవరం కు వెళ్లేందుకు విజ్జేశ్వరం వద్ద అడ్డంగా ఉన్న గడ్డర్ ఎత్తు పెంచడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.రాజమండ్రి రోడ్ కం రైల్ వంతెన మరమ్మత్తులు నేపథ్యంలో రాజమహేంద్రవరం కు వయా బ్యారేజ్ మీదుగా ఆర్టీసి బస్సులు తిరిగే అవకాశం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకుని రావడం జరిగింది. ఈ నేపథ్యంలో విజ్జేశ్వరం విద్యుత్ ప్లాంట్ సమీపంలో పల్లె వెలుగు బస్సులు వెళ్లేందుకు అనువుగా గెడ్డర్ ఎత్తు పెంచాలని జిల్లా కలెక్టర్ మాధవీలత ఇరిగేషన్ అధికారులను ఆదేశించడం జరిగింది. తదనుగుణంగా ధవళేశ్వరం సూపరింటెండెంట్ ఇంజనీర్ జీ. శ్రీనివాస రావు గెడ్డర్ ఎత్తు పెంచినట్లు కలెక్టర్ కు నివేదిక అందచేశారు.
Prajavartha Online Telugu News