-శిబిరాల వద్ద ఆరోగ్య శ్రీ మిత్ర కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చెయ్యండి
-కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పూర్తి స్థాయి లో విజయవంతం చేయడానికి వైద్య సేవలు, చికిత్స అవసరమైన వారిని గుర్తించే ప్రక్రియ అత్యంత పకడ్బందీగా నిర్వహించవలసి ఉంటుందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు.శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి సిఎం క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు తోపాటు జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయి వరకు అధికారులు సిబ్బందితో దృశ్య విజ్ఞాన సమావేశం ద్వారా జె ఏ సి పై దిశా నిర్దేశనం చేసి, లాంఛనంగా ప్రారంభించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ , రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజల ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా సమగ్ర సర్వే, అనంతరం వైద్య పరీక్షలు, రోగ నిర్దారణ, చికిత్స, ఉచితంగా మందులు పంపిణీ, ఆరోగ్యశ్రీ పథకం కింద తదుపరి వైద్య సేవలు అందించే వరకు ప్రతి ఒక్క వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించడం జరిగిందన్నారు. ఏ ఎన్ ఎమ్, ఆశా, సి హెచ్ ఓ లు సంయుక్తంగా జే ఏ సి విజయవంతం అవడంలో కీలక బాధ్యతలను చేపట్టాలని కోరారు. ఆరోగ్యశ్రీ మిత్రా లకు చెందిన సమాచారం ప్రజలకు అందచేయాలని, వైద్య శిబిరాల వద్ద ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.మొత్తం ఐదు దశల్లో సర్వే నుంచి వైద్య చికిత్స వరకు చేపట్టవలసిన కార్యాచరణ పై ముఖ్యమంత్రి దిశా నిర్దేశనం చేశారని కలెక్టర్ పేర్కొన్నారు. ఆమేరకు జిల్లాలో జే ఏ సీ పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని కోరారు. కాతేరు లో నిర్వహించిన పైలట్ వైద్య శిబిరం నుంచి తెలుసుకున్న అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ రానున్న రోజుల్లో వాటిని అధిగమించి సమర్థవంతంగా ఇంటింటి సర్వే, నిర్దేశించిన ఏడు పరీక్షలు నిర్వహించి ఆరోగ్య డేటా నమోదు, టోకేన్లు జారీ, తదుపరి వైద్య శిబిరం ఏర్పాటు వివరాలు సమగ్ర సమాచారం ఇవ్వాలన్నారు. 4వ దశలో మెడికల్ క్యాంపు నిర్వహించి టోకెన్ జారీ చేసిన వారికి, నేరుగా వైద్య శిబిరానికి వచ్చిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి సేవలు అందించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఆరోగ్యశ్రీ కింద వైద్య చికిత్స చేసుకున్న వారి ఆరోగ్యం పరిస్థితి అనుసరించాల్సి ఉంటుందన్నారు.5వ దశలో భాగంగా తదుపరి వైద్య సేవలకు రిఫరల్ ఆసుపత్రికి సిఫార్సు చేసి , ఆరోగ్య మిత్రకు అనుసంధానం చేయడం జరగాలన్నారు.వైద్య శిబిరాలకు వొచ్చిన వారి ఆరోగ్య పరిస్థితి, తదుపరి వైద్య పరంగా అందించాల్సిన చికిత్స కోసం ఖచ్చితమైన సిఫార్సు ఉండాలని, అందులో భాగంగా సిఫార్సు చేస్తూ టోకెన్ జస్తీ చెయ్యాలని స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ కింద గతంలో వైద్య సేవలు పొందిన వారి ప్రస్తుత ఆరోగ్య స్థితి పై కూడా గ్రామ స్థాయి వైద్య శిబిరాల్లో నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కింద గ్రామాల సందర్శన సమయంలో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు పొందిన వారిని తప్పనిసరిగా సందర్శించి, వైయస్ఆర్ ఆసరా కింద సంపూర్ణ ఆరోగ్యం కోసం తమ బాధ్యత నిర్వహించాల్సి ఉంటుందన్నారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా ఎన్. తేజ్ భరత్, సహాయ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్, రాజమహేంద్రవరం అర్బన్ సమన్వయ కర్త డా గూడూరి శ్రీనివాస్, డి ఏం హెచ్ ఓ డా కె. వేంకటేశ్వర రావు, డి సి హెచ్ ఎస్ డా ఎమ్. సనత్ కుమారి, ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ డా పి. ప్రియాంక, డి ఏల్ డివో పి. వీణా దేవి, ఇతర వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News