రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా ట్రైనింగ్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి శిక్షణా కార్యక్రమాలలో భాగంగా పంచాయతీ రాజ్ శాఖ ద్వారా జరుగుతున్న పనులను పర్యవేక్షణ చెయ్యడం జరిగింది.శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా గ్రామ పంచాయతీ అధికారి కార్యాలయమును (DPO ఆఫీసు) సందర్శించుట జరిగినది.పంచాయితీ రాజ్ చట్టములో గల ప్రభుత్వ ఉత్తర్వులు, జిల్లాలో అమలు చేస్తున్న పంచాయితీ చట్టాలు పై అవగాహన పొందటం జరిగిందని ఈ సందర్భంగా యశ్వంత్ కుమార్ తెలిపారు. గ్రామ పంచాయితీల నందు నిర్వహించవలసిన రికార్డుల గురించి డిపివో నుంచి సహాయ కలెక్టర్ వివరాలు తెలుసుకొనియున్నారు.అనంతరం రాజవోలు గ్రామ పంచాయితీని సందర్శించి గ్రామములొ స్వామిత్వ అమలు విధానము గురించి క్షేత్ర స్ధాయిలో సమగ్ర వివరాలను అడిగి తెలుసుకున్నారు.జిల్లా గ్రామ పంచాయితీ అధికారి జె. సత్యనారాయణ , కొవ్వూరు డివిజినల్ పంచాయితీ అధికారి వై. అమ్మాజీ, జిల్లా గ్రామ పంచాయితీ కార్యాలయము పరిపాలనాధికారి శఎమ్. జగదీశ్వరీ స్వామిత్వ కో-ఆర్డినేటర్ కె. పద్మజ , డిపి ఆర్సి కో-ఆర్డినేటర్ సునీల్ ఆర్మస్ట్రాంగ్ జిల్లా గ్రామ పంచాయితీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News