Breaking News

నగర ప్రజలందరికి కృతజ్ఞతలు…

-నగరపాలక సంస్థ కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వినాయక చవితి పండుగను పురస్కరించుకుని వినాయక విగ్రహ నిమార్జనాల సమయంలో వచ్చినటువంటి పూజ సామగ్రి, పుష్పాలు, ఆకులు, పండ్లు మరియు పత్రి ని విజయవాడ నగరపాలక సంస్థ వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బిన్స్ లలో వేయడం మరియు పారిశుధ్య కార్మికులకు అందజేయడం జరిగినదని అందులో 600 కేజీలు పువ్వులు మరియు 1590 కేజీలు పత్రి వచ్చిందని ఫ్లవర్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ద్వార పువ్వులతో పరిమళమైన అగరబత్తీలు, దూపాలను తయారుచేయడం జరుగుతుందని, పత్రి ని మిగిలిన వ్యర్ధాలను విండో కంపోస్టింగ్ ద్వార ఎరువుగా తయారుచేయడం జరుగుతుందని అన్నారు.విజయవాడ నగరాన్ని అభివృద్ధి పధంలో నడుపుటకు మరియు పరిశుభ్రత ఇతర రంగాలలో జాతీయ స్థాయిలో అవార్డులు సాధించుటకు సహకరించిన ప్రతి ఒక్కరికి కమిషనర్ హ్రుదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. విజయవాడ నగరపాలక సంస్థ పబ్లిక్ హెల్త్ వర్కర్లు, వార్డు శానిటేషన్ సెక్రటరీలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సూపర్‌వైజర్లు, హెల్త్ ఆఫీసర్లు మరియు ఇతర అధికారులు మరియు సిబ్బంది కి అభినందనలు తెలియజేస్తూ, ఈ గొప్ప కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధికారులకు మరియు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *