-అక్టోబరు నెల 16 వ తేదీ నుంచి నవంబరు 5 వ తేదీ వరకు
-కలెక్టరేట్ లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం
-జాయింట్ కలెక్టరు తేజ్ భరత్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లాకు కేటాయించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ పరికరాలను బెల్ సాంకేతిక నిపుణుల ఆధ్వర్యంలో అక్టోబరు 16 నుంచి నవంబరు 5 వ తేదీ వరకు 20 రోజులు పాటు తొలి దశ ఈవీయం మిషన్ల పనితీరును పరిశీలించడం జరుగుతోందని జిల్లా జాయింట్ కలెక్టరు ఎన్. తేజ్ భరత్ తెలియజేసారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం రాజకీయ పార్టీలతో జిల్లా రెవెన్యూ అధికారి జి. నరశింహం తో కలసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జేసీ తేజ్ భరత్ మాట్లాడుతూ ఈ వీయం పరికరాల తొలి దశ తనిఖీలను 20 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అన్ని అన్నిరోజులు నిరంతరాయంగా ఈవీయం పరికరాలను తొలి దశ పనితీరును ఆయా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అధికారి ప్రతినిధుల సమక్షంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. తప్పని సరిగా ఆయా పార్టీలు వారి ప్రతినిధులను పంపాలని జేసీ తేజ్ భరత్ తెలిపారు.ఈ సమావేశంలో బిజేపీ, వైఎస్సార్ సీపీ, ఆమ్ ఆద్మీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News