Breaking News

న్యాయవాదులతో సమావేశం…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళవారం తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయస్థాన ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత వివిధ భీమా సంస్థల ప్రతినిధులు మరియు ఆ సంస్థల న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. మార్చి 9వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ నందు అధిక మొత్తంలో మోటారు వాహనాల యాక్సిడెంట్ కేసులను పరిష్కరించేందుకు, బాధితులకు తగు పరిహారం అందించేందుకు తీసుకోవలసిన చర్యల గురించి చర్చించారు. ఈ మేరకు పెండింగ్ లో ఉన్న మోటారు వాహనాల యాక్సిడెంట్ కేసులను గుర్తించి ఆ జాబితాను జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు అందించాలన్నారు. త్వరలో ముందస్తు లోక్ అదాలత్ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. యాక్సిడెంట్ కేసుల్లోని బాధితులు, భీమా సంస్థల ప్రతినిధులు, ఇరు పక్షాల న్యాయవాదులు ఈ సమావేశాల్లో పాల్గొని వారి కేసులను పరిష్కరించుకోవాలని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *