Breaking News

జిల్లాకు స్ఫూర్తి గా నిలిచిన దేవరపల్లి మహిళా క్రికెట్ బృందం

-కోచ్ ల శ్రమకి తగ్గ ఫలితం సాధించారు
-జిల్లాకు ప్రాతినిధ్యం వహించిన ప్రతీ ఒక్కరూ విజేతలే…
– కలెక్టరు – మాధవీలత, జెసి
-తేజ్ భరత్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరీ జిల్లా పేరును రాష్ట్ర స్థాయిలో దేవరపల్లి సచివాలయం మహిళా క్రికెట్ టీమ్ ఉత్తమ ప్రదర్శన ఇచ్చి ద్వితీయ స్థానంలో నిలిచిన మరేందరికో స్ఫూర్తిగా నిలిచారని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ లు అభినందించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో దేవరపల్లి సచివాలయం బృంద సభ్యులు ఆడుదాం ఆంధ్రా మహిళ క్రీకెట్ క్రీడాకారులను కలెక్టర్ మాధవీలత, జేసీ తేజ్ భరత్ ప్రత్యేకంగా అభినందించారు. కెప్టెన్ చింతపల్లి కవిత నేతృత్వం లో కలెక్టర్ ను కలిసి, వారు సాధించిన ట్రోఫీ నీ ప్రదర్శించారు. ఈ సంధర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రికి వచ్చిన ఆలోచనతో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా పోటీలలో జిల్లా కు ప్రాతినిధ్యం వహించిన, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు క్రీడల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ స్పూర్తి నివ్వడం జరిగిందనీ పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో జిల్లాకు ప్రాతినిధ్యం వహించిన ఐదు క్రీడల్లో దేవరపల్లి సచివాలయం 1 మహిళల క్రికెట్ టీమ్ విజేతలు కావడం ద్వారా జిల్లా ప్రతిష్టను మరింత ఇనుమడింప చేశారని అభినందించారు. గత 45 రోజులుగా పడ్డ శ్రమకి ఈ ఫలితం ఎంతో ఉపశమనం కల్గించింది అని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్, స్పోర్ట్స్ అధికారులు, ఇతర జిల్లా అధికారులు, సిబ్బంది కృషికి గుర్తింపుగా మీ విజయం నిలిచిందని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ మాట్లాడుతూ, రాష్ట్రస్థాయిలో క్రికెట్ విభాగంలో ద్వితీయ స్థానంలో నిలిచిన మహిళల బృందం వారిలోని ప్రతిభను చాటేందుకు గొప్ప వేదికగా సద్వినియోగం చేసుకోవడం వారిలోని పట్టుదలకు నిదర్శనం అన్నారు. ఒడి దుడుకులను అధిగమించి క్రీడల్లో మహిళలు సాధించిన విజయం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. విజయం సాధించడం లో కోచ్ ల యొక్క కృషి, శ్రమ అభినందనీయం అన్నారు. రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలలో రెండో స్థానంలో నిలిచిన కలెక్టర్ ను కలిసిన వారిలో తూర్పు గోదావరీ జిల్లా మహిళల జట్టులో దేవరపల్లి సచివాలయం క్రీకెట్ బృందం లో చింతపల్లి కవిత (కెప్టెన్)  పట్టపగలు శ్రీవల్లి,  ఎలపోలు తేజేస్వి,  గేదల హేమ మాధురి , ఖండవల్లి జాహాన్వీ, ఖండవల్లి తేజ శ్రీ , ఓరుగంటి హేమలత,  పిన్నమణి సుచిత్ర లక్ష్మి ,  శెట్టి మంజుల, శెట్టి ప్రసన్న,  తంగెళ్ల చిన్న బుజ్జి,  తంగెళ్ల ఉమాదేవి,  తంగెళ్ల వెంకట సౌజన్య ,  ఉద్దండ రమ్యశ్రీ , ఉప్పలపాటి జ్యోతిర్మయి,  ఉప్పలపాటి సంధ్య లు ఉన్నారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, స్పోర్ట్స్ అధికారులు బి వి జి నాగేంద్రన్, తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *