Breaking News

రిలయన్స్ బయో ఎనర్జీ లిమిటెడ్ ద్వారా జిల్లాలో రెండు బయో గ్యాస్ ప్లాంట్స్ ఏర్పాటు

-నేడు కాపవరం యూనిట్ కు వర్చువల్ ద్వారా శంఖుస్థాపన
– కలెక్టర్ మాధవీలత
– ఎమ్మేల్యే తలారి వెంకట్రావు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు మండలం కాపవరం దొమ్మెరు గ్రామంలో 36 ఎకరాల లో 43 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి లక్ష్యం తో 256 కోట్ల రూపాయలు పెట్టుబడి తో 270 మంది కి ఉపాధి నిచ్చేలా రెండు బయో ప్లాంట్ యూనిట్స్ నెలకొల్పానున్నట్లు జిల్లా కలెక్టర్ డా కే.. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం లో, కొవ్వూరు మండలం కాపవరం గ్రామంలో “రిలయన్స్ బయో ఎనర్జీ లిమిటెడ్” వారిచే ఏర్పాటు చేయబోయే పరిశ్రమ కు కలక్టరేట్ లో కలెక్టర్ శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భం గా కలెక్టర్ కె. మాధవీలత వివరాలు తెలియచేస్తూ, రాష్ట్ర పరిశ్రమలు మౌలిక సదుపాయలు, పెట్టుబడులు వాణిజ్యం మరియు సమాచార సాంకేతిక శాఖమాత్యులు గుడివాడ అమర్నాథ్ గా చేతుల మీదుగా వెలగపూడి నుంచి “వర్చవల్” విధానం లో ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ. ఎమ్మేల్యే తలారి వెంకట్రావు మాట్లడుతూ, రాష్ట్రం లో రిలయన్స్ సంస్థ తొలి దశ లో 1024 కోట్ల రూపాయలు పెట్టుబడి తో 1080 మంది కి ఉపాది లక్ష్యం తో 8 “కంప్రస్సడ్ బయో గ్యాస్” ప్లాంట్ లను నెలకొల్పా నున్నారనీ తెలియ చేశారు. ఇందులో భాగంగా తూర్పు గోదావరీ జిల్లా లో కొవ్వూరు మండలం కాపవరం, దొమ్మెరు గ్రామంలో  36 ఎకరాల లో 43 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి లక్ష్యం తో రూ.256 కోట్ల పెట్టుబడి తో 270 మంది కి ఉపాధి నిచ్చేలా రెండు బయో ప్లాంట్ యూనిట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నేడు కాపవరం యూనిట్‌ పనుల శంఖుస్థాపన చేశారన్నారు. . రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిథులు ఆరు నెలల్లో ఉత్పత్తి రావడం జరుగుతుందనీ ఈ సంధర్భంగా తెలియ చేశారు. బయో-ఎనర్జీ ప్లాంట్లు కంప్రెస్డ్ బయో-గ్యాస్‌తో పాటు సేంద్రీయ ఎరువులను ఉత్పత్తి చేస్తాయి. కాపవరం యూనిట్‌ ద్వారా సంవత్సరానికి 7000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో సుమారు 100 మందికి ఉపాధి అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల అధికారి బి. వేంకటేశ్వర రావు , సంక్షేమ శాఖ అధికారులు కే ఎస్ జ్యోతి, ఎమ్. సందీప్, రిలయన్స్ బయో ఎనర్జీ లిమిటెడ్ ప్రతినిథులు జి. కృష్ణ కుమార్, ఎమ్. సుధీర్, ఆర్.. మంజ్రేకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *