Breaking News

వృద్ధాప్య దశలో ఉన్న తల్లితండ్రుల సంరక్షణ బాధ్యత పిల్లలు తీసుకోవాలి

-తల్లి తండ్రులు సంరక్షణ పిల్లల కనీస బాధ్యత
-వృద్ధుల సంరక్షణ కోసం చట్టాలు అమలు చెయ్యడం జరుగుతోంది
-జుజ్జవరపు బంగారయ్య దంపతుల సమస్య తెలుసుకున్న కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వృద్యాప్యం లో ఉన్న తల్లితండ్రులను చూసే బాధ్యత పిల్లలను స్వీకరించాలని, వారీ విషయంలో అలక్ష్యం వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా మెజిస్ట్రేట్ మరియు కలెక్టర్ కె. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం ఉదయం కలక్టరేట్ లో తూర్పుగోదావరి జిల్లా, రంగంపేట మండలం, రంగంపేట గ్రామంకు జుజ్జవరపు బంగారయ్య (84) వారి భార్య జుజ్జవరపు లక్ష్మి కాంతం (76 ) కలిసి తమ కుమారుడు ఇంటి నుంచి బయటకు పంపేశారనీ, తమ కష్టార్జితం తో సంపాదించుకున్న ఇంటినీ స్వాధీనం చేసుకుని, నిలవ నిడలేకుండా చేశారని తమ ఆవేదనని కలెక్టర్ కి విన్నవించారు. తమని సంరక్షిస్తున్న చిన్న కుమార్తె నుకూడా తమ కుమారుడు భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు తెలియ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, వృధ్యాప్యంలో ఉన్న తల్లిదండ్రుల విషయంలో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా పార్లమెంటు ఓ చట్టాన్ని రూపొందించిందనీ అన్నారు. వృద్ధ తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమం, మెయింటెనన్స్ యాక్ట్ 2007 పేరుతో దీన్ని అమలులోకి తీసుకొచ్చా రన్నారు.  కేంద్రం రూపొందించిన చట్టానికి అనుగుణంగా  రాష్ట్ర ప్రభుత్వం కూడా నిబంధనలు రూపొందించడం జరిగిందన్నారు. మన కోసం అహర్నిశలు శ్రమించి వృద్యప దశలో ఉన్న తల్లితండ్రులను పరిరక్షించడం వ్యక్తిగత బాధ్యత అని స్పష్టం చేశారు. వృధ్యాప్యంలో ఉన్న తల్లిదండ్రుల విషయంలో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా పార్లమెంటు ఓ చట్టాన్ని రూపొందించిందనీ అన్నారు. వృద్ధ తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమం, మెయింటెనన్స్ యాక్ట్ 2007 పేరుతో దీన్ని అమలులోకి తీసుకొచ్చారనీ అన్నారు.  కేంద్రం రూపొందించిన చట్టానికి అనుగుణంగా  నిబంధనలు రూపొందించడం జరిగిందన్నారు. మన కోసం అహర్నిశలు శ్రమించి వృద్యప దశలో ఉన్న తల్లితండ్రులను పరిరక్షించడం వ్యక్తిగత బాధ్యత అని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, 2011 డిసెంబర్ 28 వ తేదీన జీవో నం. 49 ని దానికి అనుగుణంగా విడుదల చేసిందనీ, అందులో భాగంగా తల్లితండ్రులు జిల్లా స్థాయి మెజిస్ట్రేట్‌ గా ఉన్న కలెక్టర్‌ తో పాటుగా జిల్లా పోలీస్ అధికారులు కూడా సీనియర్ సిటిజన్లకు సంబంధించి కేసుల విచారణ, వాటి పురోగతిని పర్యవేక్షించాల్సి ఉంటుంది. సంభందిత రెవెన్యూ డివిజన్ అధికారి ఆధ్వర్యంలో అప్పిల్లెట్ అధికారి హోదా లో దరఖాస్తులను స్వీకరించి తదనుగుణంగా ఉత్తర్వులు జారీ చేస్తారని పేర్కొన్నారు. కలెక్టర్ మాధవీలత స్పందించి తగు చర్యలు తీసుకోవాలనీ రెవెన్యూ, పోలీసు అధికారులు ఆదేశించడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *