-నివాళులు అర్పించిన కలెక్టర్ , ఇతర అధికారులు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 103 వ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్వహించుకోవడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. స్ధానిక కలక్టరేట్ లో బుధవారం ఉదయం మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య సేవలు అందించిన సేవలు సదా ఆచరణీయం అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వము ఆదేశాల మేరకు దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలను పురస్కరించుకుని నివాళులు అర్పించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎమ్. సందీప్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కే ఎస్. జ్యోతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News