Breaking News

ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దు- తక్షణమే డిమాండ్లను పరిష్కరించండి… : యం.రాజుబాబు

-రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోన్2, విజయవాడ
-నల్ల బ్యాడ్జీలతో రవాణాశాఖ ఉద్యోగులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించకపోతే చలో విజయవాడ తప్పదు ఏపీ ఎన్జీజీఓస్ విజయవాడ నగరశాఖ అధ్యక్షుడు సిహెచ్ శ్రీరామ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరిస్తుందని ఇప్పటివరకు ఎంతో సహనంతో ఎదురుచూశారని ఇకనైనా న్యాయపరమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని, ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దని రవాణాశాఖ ఉద్యోగుల సంఘం నేత రాజుబాబు అన్నారు. బందరు రోడ్డులో గల డిటిసి ఆఫీసు ప్రాంగణంలో మంగళవారంనాడు ఉద్యోగులు నల్ల బ్యాడ్జిలను ధరించి విధులకు హాజరయ్యారు. మధ్యాహ్నం భోజన విరామం సమయంలో ఏపీ జేఏసీ విడుదల చేసిన 27న చలో విజయవాడ పోస్టర్ తో ఉద్యోగులు ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా రాజుబాబు మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలను న్యాయపరమైన డిమాండ్ల సాధనకై ఏపీ జేఏసీ ఇచ్చినపిలుపు మేరకు నల్ల బ్యాడ్జీలను ధరించి విధులకు హాజరయ్యమని, సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యోగులు చలో విజయవాడ కార్యక్రమంనకు రావడానికి సిద్ధమవుతున్నారని రాజుబాబు అన్నారు. అధికారంలోకి వస్తే సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ ను అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు పాత పెన్షన్ ను అమలుచెయ్యలేకపోవడం బాధాకరం అన్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడికైనా పాత పెన్షన్ అమలు చేసేవిధంగా పక్రియ మొదలుపెడుతుందేమో అని సీపీఎస్ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎంతగానో ఎదురుచూస్తున్నారని రాజుబాబు అన్నారు. శ్రీరామ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంతో ఇప్పటికే పలుమార్లు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశాలలలో ఉద్యోగుల సమస్యలపై ఏపీ జేఏసీ మాట్లాడినప్పటికి ఫలితం లేకుండా పోయిందన్నారు. డిఎ లు లేవు వాటి ఏరియస్ లేవు, ఐఆర్ లేదు, సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ లేవని ఆవేదని వ్యక్త పరిచారు. సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఉద్యోగుల సమస్యలు ఎక్కడివేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉందన్నారు. డిమాండ్లు పరిష్కారం కాకపోతే ఏపీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 27న చలో అసెంబ్లీ విజయవాడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఉద్యోగులు ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోన్ 2 కార్యదర్శి కెవివి నాగమురళి, సహదక్షురాలు జి ఉషాసుందరి, నాలుగోవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సునీల్ నాయక్, ఉద్యోగుల సంఘం నాయకులు కె రామచంద్రరాజు, సత్యనారాయణ మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *