Breaking News

నగరంలో ‘శ్రిష్ట జ్యూయలరీ షోరూం’ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో స్వచ్ఛతలో నాణ్యతలో మన్నికైనదనే నమ్మకాన్ని ఇచ్చే ‘శ్రిష్ట జ్యూయలరీ షోరూం’ ప్రారంభించబడింది. బుధవారం బకింగ్‌హాం పోస్టాఫీస్‌ రోడ్డు, బాలాజీ కాంప్లెక్స్‌లో ‘శ్రిష్ట జ్యూయలరీ షోరూం’ను ముఖ్య అతిధి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్‌ రాయన భాగ్యలక్ష్మీ చేతుల మీదుగా ప్రారంభించారు. ముఖ్య అతిధులు తదితరులు నిర్వాహకులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రంగంలో అనుభవం కలిగిన నూతన షోరూంను నగరంలో ప్రజలకు చేరవుగా బాలాజీ కాంప్లెక్స్‌లో ప్రారంభించడం సంతోషదాయకమన్నారు. ఆధునాతన సరికొత్త మోడల్స్‌లో లైట్‌ వెయిట్‌ ఆభరణాలను అతి తక్కువ ధరలలో అందిస్తున్నారని చెప్పారు. మగువల మనసు దోచుకునే విధంగా చక్కని నగిషీతో రూపొందించబడిన ఆభరణాలు అందుబాటులో తీసుకువచ్చారన్నారు. రాబోయే కాలంలో నాణ్యమైన ఆభరణాలకు మారుపేరుగా ఇచ్చే శ్రిష్ట జ్యూయలరీ నిలవనుందన్నారు. ఈ నూతన షోరూం దినదినాభివృద్ధి చెంది అన్ని నగరాల్లో విస్తరించాలని ఆకాంక్షించారు. అనంతరం ‘శ్రిష్ట జ్యూయలరీ షోరూం’ అధినేతలు మాట్లాడుతూ తమ వద్ద 50 శాతం డిస్కౌంట్‌తో తరుగు, మార్కెట్‌ ఛార్జెస్‌ వుండవన్నారు. ఆధునాతనమైన వివిధ రకాలైన మోడల్స్‌లో అందుబాటు ధరలో తమ వద్ద ఆభరణాలు లభ్యమవుతాయన్నారు. ఇంత చక్కటి 91.6 బంగారు ఆభరణాలు షోరూంను ప్రతి ఒక్కరూ సందర్శించి ఖచ్చితమైన నాణ్యమైన బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *