Breaking News

ప్రతీ నిరుపేదకూ స్వంత ఇల్లు.. అదే జగనన్న సంకల్పం

-ధవళేశ్వరం వడ్డెర కాలనీలో 256 మంది అర్హులైన లబ్ధిదారులకు గృహాలు పంపిణీ
– గత పాలకులు నిర్లక్ష్యం వల్ల ఇళ్ల పంపిణీలో జాప్యం.
-ఆశయం తప్ప ఆశ లేని నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి
-టిడ్కో గృహాల పంపిణీ సభలో
-మంత్రి వేణుగోపాలకృష్ణ
-ఎంపీ మార్గాని భరత్ రామ్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ప్రజలకు అత్యంత నమ్మకం ఉందని, పాలకులు రాజ్యాంగబద్ధంగా అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందిస్తూ పాలన సాగించడం వలన సాధ్యమవుతుందని, అందుకు నిదర్శనమే నేడు టిడ్కో గృహా లను అర్హులైన లబ్ధిదారులకు అందించడమని జిల్లా ఇన్చార్జి మంత్రి రాష్ట్ర బీసీ సంక్షేమం సమాచార పౌర సంబంధాలు సినిమా ఆటోగ్రాఫీ శాఖ మంత్రి రాజమండ్రి రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ధవళేశ్వరం వడ్డెర కాలనీలో 256 టిడ్కో గృహాలను రాజమండ్రీ ఎంపీ మార్గాని భరత్ రామ్, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్ పర్సన్ మేడపాటి షర్మిలా రెడ్డి , రూడా చైర్మన్ రౌతు సూర్య ప్రకాశరావు, రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి మంత్రి వేణు గోపాల్ టిడ్కో లబ్ధిదారులకు గృహ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి వేణు గోపాలకృష్ణ మాట్లాడుతూ ఆశయం తప్ప ఆశ లేని నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అందుకు నిదర్శనం గత పాలకులు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు 14 వేల కోట్లు బకాయిలను చెల్లిస్తామని మాట తప్పితే అది కాస్త 25 వేల కోట్లుకు చేరిందన్నారు. మహిళలకు ఇచ్చిన వాగ్దానం మేరకు నాలుగు విడతల్లో ఆసరాగా రూ .25వేల కొట్లు రుణమాఫీ చేసి చూపించిన నేత సీఎం జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. లబ్ధి దారులకు గృహాలు అంద జేయడంలో గత పాలకులు ఎన్ని అడ్డంకులు సృష్టించిన అర్హులైన ప్రతి ఒక్కరికి సొంతింటి కల సహకారం చేయాలన్నదే లక్ష్యంగా నేడు ధవళేశ్వరం వడ్డెర కాలనీలో 256 మంది అర్హులైన లబ్ధి దారులకు గృహాలను అందిస్తున్నా మన్నారు. పేదవాడిని ఉద్ధరించాలనే లక్ష్యంతో పేదరికం నిర్మూలనే ఆశయంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని స్థాపించి పాలన సాగిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. గత ఎన్నికల సమయంలో రైతులు రుణమాఫీ చేద్దామంటే ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయవద్దుని, మాట ఇచ్చి మడం తిప్పవద్దన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. ఎంపీ మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడమే సీఎం జగన్మోహన్ రెడ్డి సంకల్పమని.. అయితే ప్రతిపక్ష నేతలు కోర్టులను‌ ఆశ్రయించి స్టే తేవడం వల్ల ఇళ్ళ స్థలాలు పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోందనన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మాటిచ్చారంటే చేసి తీరతారని, గత పాలకొల్లు పాలనలో డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, రైతులకు రుణమాఫీ, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు, నిరుద్యోగ భృతి.. ఇలా అనేక వాగ్దానాలిచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దఫదఫాలుగా డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీ చేసిన ఘనత సీఎం జగనన్నకే దక్కుతుందని అన్నారు. ‌అదే మాదిరిగా పేదలకు ఇళ్ళ స్థలాలు, ఇళ్లు కట్టించి ఇచ్చే బాధ్యతను జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారని చెప్పారు. రాజమండ్రిలో అర్హత కలిగి, హామీ పత్రం ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ త్వరలోనే ఇళ్ళ స్థలాలు అందజేస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. టిడ్కో గృహాలు నిర్మించిన తర్వాత దీర్ఘకాలంగా వినియోగంలో లేకపోవడం వల్ల , అన్నీ శుభ్రం చేసి వచ్చే మంగళవారం నాటికి అప్పగిస్తామని తెలిపారు. ఈలోగా రథసప్తమి పర్వదిన సందర్భంగా కొబ్బరికాయ కొట్టి, పాలు పొంగించుకోవచ్చునని అన్నారు. ఎంపీగా తన పదవీ కాలంలో రాజమండ్రి నగరాన్ని రూ.400 కోట్లతో ఎంతగానో అభివృద్ధి చేశానని చెప్పారు. నగర వాసుల సంపూర్ణ ఆశీస్సులు, మద్దతుతో మరింతగా అభివృద్ధి చేసి..విశ్వ నగరంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మేడపాటి షర్మిల రెడ్డి మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం వలన టిడ్కో ఇల్లు లబ్ధిదారులకు అందించడంలో జాప్యం జరిగిందని , నేడు సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి టిడ్కో గృహాలకు మౌలిక సదుపాయాలు కల్పించడం వలన నేడు లబ్ధిదారులకు అందిస్తున్న మన్నారు. అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాన్ని వారి ఇంటి వద్దకే అందిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రుడా ఛైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, సంకిస భవానీ ప్రియ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి, వైసీపీ సీనియర్ నేత నక్కా శ్రీనగేష్ స్థానిక నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు .

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *