-సాంస్కృతికి పరంగా ఎంతో పేరుగాంచిన రాజమహేంద్రవరాన్ని మరింత పర్యాటక కేంద్రంగా అభివృద్ధికి కృషి చేస్తా…
-రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్.
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కళా రంగానికి ఎనలేని సేవలు అందిచడతో పాటు, ప్రజల అభ్యున్నతి కొరకు ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొని సేవలందించిన మహనీయులు కళామతల్లి ముద్దుబిడ్డ స్వర్గీయ ఎస్వీ రంగారావు ఆయన జయంతి సందర్భంగా వారికి నివాళులర్పించడం జరిగిందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. స్వర్గీయ విశ్వ నటన చక్రవర్తి నటసార్వభౌమ శ్రీ ఎస్వీ రంగారావు 106వ జయంతి పురస్కరించుకొని స్థానిక గోదావరి గట్టు నందు గల ఎస్వీ రంగారావు విగ్రహానికి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పూలమాల వేసి నివాళులు వేసి ఘనంగా అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఎస్వీ రంగారావు వంటి మహనీయులు వారు సినీ రంగానికి వారు చేసిన ఎనలేని సేవలు, ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.మహనీయులు చేసిన సేవా దృక్పథ కార్యక్రమాలను మనందరం నెమరు వేసుకుంటూ వారి బాటలోనే మనం ముందుకు సాగాలని ఆయన అన్నారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా సినీ ప్రముఖులైన ఎస్వీ రంగారావు కార్యక్రమానికి హాజరై వారికి నివాళులర్పించడం జరిగిందన్నారు. సాంస్కృతికి పరంగా ఎంతో పేరుగాంచిన రాజమహేంద్రవరాన్ని మరింత పర్యాటక కేంద్రంగా అభివృద్ధిచేసి టూరిజం హబ్ గా చేసేందుకు తన వంతు కృషి చేస్తానని మంత్రి అన్నారు. కేవలం తెలంగాణకే పరిమితమైన సినీ స్టూడియోలు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక సినిమా స్టూడియోను ప్రభుత్వ సహకారంతో నిర్మాణం చేపట్టేందుకు తాను తప్పక కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా అన్నారు. అనంతరం ధవలేశ్వరం గ్రామంలో శ్రీ ఎస్వీ రంగారావు 106వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కందులు దుగ్గేష్ పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎస్విఆర్ కల్చరల్ అసోసియేషన్ తరపున ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. .
Prajavartha Online Telugu News