-తక్షణమే పుష్కరాల ఏర్పాట్లకు దేవాదాయ శాఖ బ్లూప్రింట్ సిద్ధం చేయాలి : మంత్రి ఆనం -ఆరు జిల్లాల్లో నది పరివాహక ప్రాంతాల్లో ఆలయల నిర్మాణం, మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి : మంత్రి ఆనం -దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న గోదావరి పుష్కరాలను దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచే విధంగా, మహా కుంభమేళా తరహాలో అత్యంత ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం …
Read More »Konduri Srinivasa Rao
గోదావరి పుష్కరాల్లో నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించాలి
-వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే ఏడాది జూన్ లో జరగనున్న పవిత్ర గోదావరి పుష్కరాల్ని పురస్కరించుకుని వైద్య సేవల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. ముఖ్యంగా నేత్ర వైద్య శిబిరాల్ని నిర్వహించాలని స్పష్టంచేశారు. ‘ఆంధ్రప్రదేశ్ రైట్ టు సైట్ సొసైటీ’ గవర్నింగ్ బాడీ సమావేశం వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో 11 ఏళ్ల అనంతరం తొలిసారిగా మంత్రి సత్యకుమార్ యాదవ్ అధ్యక్షతన …
Read More »ఆసుపత్రుల ఆవరణలో మొక్కలు నాటాలి
-పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు జరపాలి -వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని రకాల ఆసుపత్రుల్లో మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, వ్యర్థాల నిర్వహణ, నీటి సంరక్షణ, ఇంధన పొదుపు, ఆరోగ్య సంస్థల్లో సుస్థిర విధానాల అమలుపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. పర్యావరణ …
Read More »కిడ్నీ రోగులకు స్వాంతన
-పరస్పర మార్పిడి (స్వాప్) విధానంలో సమీప బంధువుల నుంచి ‘కిడ్నీ’లు స్వీకరించేందుకు మంత్రివర్గం ఆమోదం -ప్రస్తుతం కుటుంబ సభ్యుల నుంచి మాత్రమే పొందే అవకాశం -కిడ్నీలను తాత, అమ్మమ్మ, నాన్నమ్మలు కూడా ఇవ్వొచ్చు.. -రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కిడ్నీ(మూత్ర పిండం) బాధిత రోగులకు అవయవ మార్పిడి విషయంలో కూటమి ప్రభుత్వం సానుకూల నిర్ణయాన్ని తీసుకుంది. అవయవాల స్వాప్ (పరసర మార్పిడి) విధానానికి కూటమి ప్రభుత్వం చట్ట బద్ధత కల్పించింది. ఒక కటుంబంలోని …
Read More »క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగిన 1387 వ (50వ) క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు. వ్యవసాయం & సహకారం 1.వ్యవసాయం & సహకార శాఖ: చిత్తూరు జిల్లా G.D. నెల్లూరు మండలం చిన్నవేపంజరి రెవెన్యూ గ్రామంలో మహాదేవమంగళం సీడ్ మల్టిప్లికేషన్ ఫార్మ్‌లో …
Read More »రాష్ట్రవ్యాప్తంగా “నవచేతన” బాల్యారంభ అభివృద్ధి స్క్రీనింగ్ కార్యక్రమం ప్రారంభం
-ప్రతి చిన్నారికి జీవితంలో అత్యుత్తమ ఆరంభాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యం -తొలి 1,000 రోజులు చిన్నారి భవిష్యత్తును నిర్ణయించే స్వర్ణావకాశం : మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి చిన్నారికి జీవితంలో అత్యుత్తమ ఆరంభాన్ని అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాల్యారంభ అభివృద్ధి (Early Childhood Development – ECD) మరియు అభివృద్ధి స్క్రీనింగ్‌పై రాష్ట్రవ్యాప్త సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఈ సందర్భంగా …
Read More »మైనారిటీల విద్యాభివృద్ధి కోసం కృషి
-చంద్రబాబు హయాం లోనే మైనారిటీల సంక్షేమం -మైనారిటీ,న్యాయశాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ -ఎస్ ఎస్ సి, ఇంటర్ లో అత్యుత్తమ మార్కులు సాధించిన మైనారిటీ విద్యార్థులకు సన్మానం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : *మైనారిటీల విద్యాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ బద్దంగా కృషి చేస్తున్నదని మైనారిటీ, న్యాయ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. రాష్ట్రస్థాయిలో పదవ తరగతి, ఇంటర్ విద్యలో అత్యుత్తమ మార్కులు సాధించిన మైనారిటీ విద్యార్థులను గురువారం మంత్రి సన్మానించి ఆశీర్వదించారు. వెలగపూడి సచివాలయం మూడవ బ్లాక్ కాన్ఫరెన్స్ …
Read More »అమరజీవి పొట్టి శ్రీరాములు కి నివాళులర్పించిన జనసేన నాయకులు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతంలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పార్టీ ముఖ్య నాయకులతో కలిసి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొని అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగస్ఫూర్తిని స్మరించుకున్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం …
Read More »ఈ నెల 12 వరకు కేజీబీవీల్లో టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు గడువు పెంపు
-సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు IAS., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 352 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 299 బోధనా సిబ్బంది పోస్టులను ఒప్పంద (కాంట్రాక్ట్) ప్రాతిపదికన భర్తీ చేయడానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 5వ తేదీతో ముగిసిందని, జూన్ 12వరకు గడువు పెంచుతున్నట్లు సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు, I.A.S. ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పు గోదావరి, డా. బి.ఆర్. …
Read More »ఎన్డీఏ కార్యాలయంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల వేడుకలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, సుజనా మిత్రా కోఆర్డినేటర్లు మరియు కార్యాలయ సిబ్బంది తో కలిసి కేక్ కట్ చేసి తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. పశ్చిమలో ప్రజలు సుజనా చౌదరిను నమ్మి 47 వేల పై చిలుకు మెజారిటీతో గెలిపించినందుకు పశ్చిమ నియోజకవర్గాన్ని ఏపీ లోనే నెంబర్ వన్ స్థానంలో ఎమ్మెల్యే సుజనా అగ్రగామిగా నిలిపారన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎమ్మెల్యే సుజనా …
Read More »
Prajavartha Online Telugu News