-కండ్రిగలో జరిగే ‘సంజీవని’ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ‘సంజీవని’ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9:00 గంటలకు అమరావతి క్యాంపు ఆఫీసు నుంచి బయలుదేరి ఉదయం 11:00 గంటలకు యాదమర్రి మండలం కండ్రిగ గ్రామం చేరుకుంటారు. మధ్యాహ్నం 1:00 గంట వరకు ప్రజా వేదికలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:35 గంటలకు సంతగేటు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి, రోగులకు అందుతున్న వైద్య సేవలను తెలుసుకుంటారు. …
Read More »Andhra Pradesh
ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీనే నిర్వహించాలని కోరాం
-ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే ప్రయత్నాలు ఆపాలని స్పష్టంచేసాం. -స్త్రీ-శక్తి పథకం విజయవంతానికి కొత్త బస్సులు, సిబ్బంది నియామకాలు చేపట్టాలి. -సిబ్బందిపై దాడులను అరికట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. -12 AAS వల్ల మెకానిక్‌లకు ఆర్థిక నష్టం కలగకుండా చూడాలని విజ్ఞప్తి. -స్త్రీ శక్తి అమలులో సిబ్బంది టికెట్లు ఇచ్చుటలో కలుగుతున్న ఇబ్బందు లను తొలగించాలని విజ్ఞప్తి. -ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని కృష్ణబాబు హామీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర సచివాలయం, అమరావతి నందు శుక్రవారం TR&B …
Read More »రాజకీయ ముసుగులో ఉన్న ఫ్యాక్షనిస్టు గత పాలకుడు: మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్
– హత్యా రాజకీయాల అసలు వారసుడు అతనే – చంద్రబాబు అభివృద్ధి చూసి ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు – వ్యక్తిగత దూషణలే రాజకీయ ఆయుధం – తెలుగుజాతికి పట్టిన రాజకీయ అరిష్టం ఆయన: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : హత్యా రాజకీయాల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న గత పాలకుడు రాజకీయ ముసుగులో ఉన్న ఫ్యాక్షనిస్టు అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. సమాజంలో విద్వేషాలు, హింస, కక్ష రాజకీయాలను పెంచే ప్రయత్నం చేస్తున్నారు.శుక్రవారం ఎపి సచివాలయంలో …
Read More »జగన్ అబద్ధాలు ఆపేసి… వాస్తవాలు మాట్లాడండి…
– మంత్రి కొండపల్లి కౌంటర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి పెన్షన్ల విషయంలో వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో కౌంటర్ ఇచ్చారు. గురువారం జగన్మోహన్‌రెడ్డి ప్రెస్‌మీట్లో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే…. చంద్రబాబు హయాంలో 6 లక్షల పెన్షన్లు తొలగించారని చెప్పినా అవాస్తవాలు, పచ్చి అబద్ధాలు మాట్లాడారని …
Read More »ప్రభుత్వాసుపత్రులకు మందుల సరఫరా, వినియోగ వ్యవస్థలో సమూల మార్పులు
-మందుల లభ్యత గురించే ప్రజలే నేరుగా తెలుసుకునేలా ‘క్యూ’ఆర్ కోడ్ సదుపాయం! -మందుల వినియోగ కాల పరిమితికి తగ్గట్టు ‘అలర్ట్’ మెసేజ్ లు -రాష్ట్ర ఇ-ఔషధి (సాఫ్ట్వేర్) కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణ -మంత్రి సత్య కుమార్ విజ్ఞప్తి మేరకు ఢిల్లీ నుంచి వచ్చిన ఉన్నతాధికారులు -మంగళగిరిలోని ఏపీఎస్ఏoఐడీసీ కార్యాలయంలో ప్రస్తుత విధానం అమలుతీరుపై ప్రత్యేక సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వాసుపత్రులకు మందుల సరఫరా, వినియోగ విధానంలో సమూల మార్పులు రాబోతున్నాయి. ప్రజలే నేరుగా సదరు ప్రభుత్వాసుపత్రుల్లో ఉన్న మందుల లభ్యత గురించి …
Read More »జీవ వైవిధ్య అవగాహన పోస్టర్ ఆవిష్కరన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా “Acting Locally for Global Impact” అనే థీమ్‌తో రూపొందించిన జీవ వైవిధ్య అవగాహన పోస్టర్‌ను ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (APPCB), ప్రాంతీయ కార్యాలయం గుంటూరు ఆధ్వర్యంలో, ITC మిషన్ సునేహరా కల్ మరియు FINISH Society సహకారంతో ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో APPCB గుంటూరు జిల్లా పర్యావరణ ఇంజనీర్ MD. నజీనా బేగం, ITC ప్రతినిధులు నారాయణ, పర్యావరణ కోఆర్డినేటర్ డి. తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. …
Read More »ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. ఇవాళ పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 44.8 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా దేవరాపల్లి, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడులో 44.7డిగ్రీలు నమోదైందన్నారు. అలాగే రాష్ట్రంలోని 28 జిల్లాలకుగాను 15 జిల్లాల పరిధిలోని 67 మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని ఆయన వెల్లడించారు.బుధవారం వరకు ఎండ తీవ్రత కొనసాగే అవకాశం ఉందన్నారు. ప్రజలు వీలైనంత …
Read More »రోడ్ ఓవర్ బ్రిడ్జి శంకుస్థాపన
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా నల్లపాడు – బండారుపల్లి స్టేషన్ల మధ్యన చేపట్టిన చినపలకలూరు ROB [రోడ్ ఓవర్ బ్రిడ్జి] నిర్మాణానికి గాను గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి, స్థానిక ఎమ్మెల్యే బి. రామాంజనేయులు తో కలిసి శంకుస్థాపన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఎంపీగా, కేంద్ర సహాయ మంత్రిగా పెమ్మసాని బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు నుంచి గుంటూరు, …
Read More »పొగాకు వినియోగం ప్రాణాంతకం… :
-‘పోస్ట్ కార్డ్స్ ఉద్యమం’ ప్రారంభం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పొగాకు వినియోగం ప్రాణాంతకమని, అందరూ వాటికి దూరంగా ఉండాలని ముఖ్యంగా యువత అస్సలు తీసుకోవద్దని తూర్పు శాసనసభ్యులు గద్దె రామమోహన్ హితవు పలికారు. శుక్రవారం ఉదయం నవజీవన్ బాల భవన్ సొసైటీ ఆధ్వర్యంలో ఆటోనగర్ అర్.టి.సి. బస్ స్టాండ్ ఆవరణలో ప్రపంచ పొగాకు వ్యతిరేక వారోత్సవాల సందర్భంగా “పోస్ట్ కార్డ్స్ ఉద్యమం” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు …
Read More »అంగన్వాడి, విద్యా వ్యవస్థ తీరు తెన్నులను పరిశీలించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 23వ తేదీ శనివారం మండలాల్లో విస్తృతంగా పర్యటించి అంగన్వాడి, విద్యా వ్యవస్థ తీరు తెన్నులను పరిశీలించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయం నుండి మండల ప్రత్యేక అధికారులతో క్షేత్రస్థాయి పరిశీలనపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మండల ప్రత్యేక అధికారులు మండలాల్లో విస్తృతంగా పర్యటించి అంగన్వాడి కేంద్రాలను సందర్శించాలన్నారు.అక్కడ ఉన్న వసతులను ముఖ్యంగా మంచినీరు, …
Read More »
Prajavartha Online Telugu News