Breaking News

జీవ వైవిధ్య అవగాహన పోస్టర్‌ ఆవిష్కరన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా “Acting Locally for Global Impact” అనే థీమ్‌తో రూపొందించిన జీవ వైవిధ్య అవగాహన పోస్టర్‌ను ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (APPCB), ప్రాంతీయ కార్యాలయం గుంటూరు ఆధ్వర్యంలో, ITC మిషన్ సునేహరా కల్ మరియు FINISH Society సహకారంతో ఘనంగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో APPCB గుంటూరు జిల్లా పర్యావరణ ఇంజనీర్ MD. నజీనా బేగం, ITC ప్రతినిధులు నారాయణ, పర్యావరణ కోఆర్డినేటర్ డి. తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. జీవ వైవిధ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రకృతి సంపదను కాపాడటం ద్వారా భవిష్యత్ తరాలకు సుస్థిరమైన పర్యావరణాన్ని అందించవచ్చని వారు పేర్కొన్నారు. స్థానిక స్థాయిలో చేపట్టే చిన్న చిన్న పర్యావరణ పరిరక్షణ చర్యలు ప్రపంచ స్థాయి ప్రభావాన్ని చూపగలవని తెలిపారు. జీవ వైవిధ్య పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని ఆయన అన్నారు. చెట్ల పెంపకం, నీటి సంరక్షణ, వ్యర్థాల తగ్గింపు, వన్యప్రాణుల పరిరక్షణ వంటి చర్యల ద్వారా ప్రకృతిని కాపాడాల్సిన అవసరం ఉందని వివరించారు. విద్యార్థులు, యువత మరియు సాధారణ ప్రజల్లో పర్యావరణ చైతన్యం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ పోస్టర్ ద్వారా “మన జీవ వైవిధ్యం – మన బాధ్యత – మన భవిష్యత్” అనే సందేశాన్ని ప్రజలకు చేరవేయడం ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *