Breaking News

ప్రభుత్వాసుపత్రులకు మందుల సరఫరా, వినియోగ వ్యవస్థలో సమూల మార్పులు

-మందుల లభ్యత గురించే ప్రజలే నేరుగా తెలుసుకునేలా ‘క్యూ’ఆర్ కోడ్ సదుపాయం!
-మందుల వినియోగ కాల పరిమితికి తగ్గట్టు ‘అలర్ట్’ మెసేజ్ లు
-రాష్ట్ర ఇ-ఔషధి (సాఫ్ట్వేర్) కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణ
-మంత్రి సత్య కుమార్ విజ్ఞప్తి మేరకు ఢిల్లీ నుంచి వచ్చిన ఉన్నతాధికారులు
-మంగళగిరిలోని ఏపీఎస్ఏoఐడీసీ కార్యాలయంలో ప్రస్తుత విధానం అమలుతీరుపై ప్రత్యేక సమీక్ష

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వాసుపత్రులకు మందుల సరఫరా, వినియోగ విధానంలో సమూల మార్పులు రాబోతున్నాయి. ప్రజలే నేరుగా సదరు ప్రభుత్వాసుపత్రుల్లో ఉన్న మందుల లభ్యత గురించి ‘క్యూఆర్’ కోడ్ ద్వార తెలుసుకునే విధానాన్ని తీసుకువచ్చే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది అలాగే మందుల వ్యవహారంలో ప్రతి ప్రక్రియ ఆన్లైన్లో నమోదు జరిగేలా, సంబంధిత పర్యవేక్షణ అధికారులకు సంక్షిప్త సందేశాల రూపంలో ‘అలర్ట్’ వెళ్లే విధంగా చర్యలు తీసుకోబోతున్నారు. ఈ మేరకు రాష్ట్రoలో 2014 నుంచి వినియోగిస్తున్న ‘ఇ-ఔషధి’ వ్యవస్థను పటిష్టం చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన కీలక సమావేశం మంగళగిరిలోని రాష్ట్ర వైద్య, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగింది. ఇందులో ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఢిల్లీ నుంచి వచ్చిన సీ-డాక్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మంత్రి శ్రీ సత్యకుమార్ ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం

రాష్ట్ర వైద్య, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ద్వారా జరిగే కొనుగోళ్లకు అనుగుణంగా ప్రభుత్వాసుపత్రులకు మందుల సరఫరా ‘ఇ-ఔషధి’ (సాఫ్ట్వేర్) అప్లికేషన్ ఆధారంగా జరుగుతోంది. ప్రతి ఏటా మందులు సర్జికల్ కొనుగోళ్ల కోసం ప్రతి ఏటా సుమారు రూ.800 కోట్ల వరకు ప్రభుత్వం వ్యయం చేస్తుంది. ఇందులో రూ. 600 కోట్ల విలువైన మందులను ప్రభుత్వం ఉచితంగా పేద రోగుల కోసం ప్రభుత్వాసు త్రులకు సరఫరా చేస్తోంది. ప్రాథమిక, సామాజిక, ప్రాంతీయ, జిల్లా, బోధనాసుపత్రులు, ఇతర ప్రత్యేక ఆసుపత్రుల ఫార్మసిస్టులు, మెడికల్ ఆఫీసర్లు, సూపరింటెండెంట్ల నుంచి వచ్చే ఇండెంట్ల ఆధారంగా ‘ఇ-ఔషధి’ ద్వారా అవసరమైన మందుల కోసం ప్రతిపాదనలు తయారవుతున్నాయి. వీటిని పరిశీలించిన అనంతరం టెండర్ల ద్వారా ఎంపిక చేసిన సంస్థలు సదరు జిల్లాల్లోని సెంట్రల్ డ్రగ్ స్టోర్లకు మందులను పంపుతున్నాయి. అవి అక్కడి నుంచి సదరు ప్రభుత్వాసుపత్రులకు సరఫరా అవుతున్నాయి. ఈ క్రమంలో జరిగే ప్రభుత్వాసుపత్రులకు జరిగే మందుల సరఫరా, వినియోగం, కాల వ్యవధి గుర్తింపు వంటి అంశాల్లో రకరకాల సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ‘ఇ-ఔషధి’ వ్యవస్థను ప్రస్తుత అవసరాలు, అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతికతకు తగ్గట్లు పటిష్టం చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు.

ప్రస్తుత విధానం అమలు తీరు పై సమీక్ష

కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్సు కంప్యూటింగ్ (సీ-డాక్) ద్వారా విడివిడిగా ఏపీతో సహా 26 రాష్ట్రాలు, ఐదు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మందుల సరఫరా వ్యవస్థ పర్యవేక్షణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన ఇ- సాఫ్ట్వేర్లో తీసుకురానున్న మార్పులపై ఢిల్లీ నుంచి వచ్చిన సి-డాక్ నేషనల్ అసోసియేట్ డైరెక్టర్ సంషాద్ అన్సారీ, ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్ పార్థ పి. చటరాజ్, ప్రాజెక్టు మేనేజర్ ముస్తాక్ అహ్మద్ మంగళగిరిలోని apsmidc కార్యాలయంలో రాష్ట్ర సీ-డాక్ ముఖ్య ప్రతినిధి, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పి.అశ్విని, డ్రగ్ వింగ్ అధికారులు, జిల్లాల్లోని సెంట్రల్ డ్రగ్ స్టోర్ల పర్యవేక్షణ అధికారులు, సీనియర్ ఫార్మసిస్టులtho సమావేశమై ప్రస్తుత విధానంలో ఉన్న సానుకూలతలు, ప్రతికూలతల గురించి అడిగి తెలుసుకున్నారు. తీసుకురానున్న మార్పులు, చేర్పులపై సలహాలు, సూచనలు స్వీకరించారు. మంత్రి శ్రీ సత్య కుమార్ చొరవ తో వీరు ఢిల్లీ నుంచి వచ్చారు

కీలక మార్పులు…!

-సదరు ప్రభుత్వాసుపత్రుల్లో ఉన్న మందుల నిల్వల గురించి అక్కడి పనిచేసే ఫార్మసిస్టులు, మెడికల్ ఆఫీసర్లు మాత్రమే కాకుండా ప్రజలు కూడా ‘క్యూ ‘ఆర్’ కోడ్ ద్వారా నేరుగా తెలుసుకునే సదుపాయాన్ని కల్పిస్తారు.

-మందులను నిర్ణీత కాలవ్యవధిలోనే ఉపయోగించే విధంగా కూడా ‘ఇ-ఔషధి’లో ‘అలర్ట్’ విధానాన్ని తేబోతున్నారు. మందులను వినియోగించే కాల పరిమితిలో ముఖ్యంగా ఆరునెలల సమయంలోగా వాడాల్సిన
(ఎక్స్పైరీ) గురించి ముందుగానే తెలుసుకునే విధానాన్ని
తెస్తారు.

– ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల (ఉప ఆరోగ్య కేంద్రాలు) నుంచి బోధనాసుపత్రుల వరకు సదరు ఆసుపత్రుల్లో మందుల నిల్వలు ఏ స్థాయిలో ఉన్నాయో ఎవరైనా తెలుసుకునే విధంగా ‘డ్యాష్ బోర్డు’ను తయారు చేస్తారు. హోదా లు మందుల గురించి పూర్తి స్థాయిలో సమాచారాన్ని తెలుసుకునేందుకు ‘గ్లోబల్ డ్యాష్ బోర్డు’ తయారవుతుంది.

రోగుల అవసరాలకు తగ్గట్లు మాత్రమే మందుల కొనుగోళ్లు, సరఫరా జరిగేలా, పారదర్శకంగా ఈ ప్రక్రియ ఉండేలా కూడా ‘ఇ-ఔషధి’లో అవసరమైన
మార్పులు తేనున్నారు.

-ఆసుపత్రుల నుంచి అవసరాలకు తగ్గట్లు మాత్రమే మందుల డిమాండ్ (రిక్వైర్మెంట్) వచ్చే విధానానికి అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

-మందుల తయారీదారులు, పంపిణీదారులు టెండర్లలో ఒప్పుకున్న ప్రకారం మందులను ప్రభుత్వాసుత్రులకు తగిన సమయంలో పంపుతున్నారా? లేదా? అన్న వివరాలను రియల్ టైమ్ విధానంలో గమనించేలా ‘ఇ-ఔషధి’ వ్యవస్థను పటిష్టం చేయనున్నారు.

-ఆయుష్ (ఆయుర్వేద, హోమియో, యూనాని) మందుల సరఫరా విధానాన్ని ఇ-ఔషధి పరిధిలోనికి తెచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నారు.

-మనమిత్ర యాప్ లోనూ ప్రతి మందు నిల్వ గురించి తెలుసుకునే సదుపాయాన్ని కల్పించబోతున్నారు.

మందుల తయారీదారులు, పంపిణీదారులు సదరు సీడీఎస్లకు సరఫరా చేసిన వెంటనే ఆ సమాచారం తక్షణమే జిల్లా అధికారులు, రాష్ట్ర అధికారులకు అలర్ట్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *