Breaking News

జ‌గ‌న్ అబ‌ద్ధాలు ఆపేసి… వాస్త‌వాలు మాట్లాడండి…

– మంత్రి కొండ‌ప‌ల్లి కౌంట‌ర్‌

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పెన్ష‌న్ల విష‌యంలో వాస్త‌వాలు తెలుసుకుని మాట్లాడాల‌ని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్ర‌క‌ట‌న‌లో కౌంట‌ర్ ఇచ్చారు. గురువారం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్రెస్‌మీట్లో మాట్లాడుతూ వైసీపీ ప్ర‌భుత్వంలో 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే…. చంద్ర‌బాబు హ‌యాంలో 6 ల‌క్ష‌ల పెన్ష‌న్లు తొల‌గించార‌ని చెప్పినా అవాస్త‌వాలు, ప‌చ్చి అబ‌ద్ధాలు మాట్లాడార‌ని కొండ‌ప‌ల్లి విమ‌ర్శించారు. జ‌గన్మోహ‌న్‌రెడ్డి పాలనలో పెన్షన్ల కోత పెడితే కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాకే పెన్ష‌న్ పెంచి వారికి భ‌ద్ర‌త క‌ల్పించామ‌ని మంత్రి తెలిపారు. గ‌త జ‌గ‌న్మోహ‌న్‌ రెడ్డి ప్ర‌భుత్వం 5 ఏళ్ల‌లో ఏకంగా 11 ల‌క్ష‌ల మంది నిరుపేద‌ల పెన్ష‌న్లు నిర్దాక్షిణ్యంగా తొల‌గించింద‌ని మంత్రి విమ‌ర్శించారు. కూట‌మి ప్ర‌భుత్వంలో ఏ ఒక్క‌రి పెన్ష‌న్ కూడా తొల‌గించ‌లేద‌ని.. కేవ‌లం మృతిచెందిన వారి పెన్ష‌న్లు మాత్ర‌మే ర‌ద్ద‌య్యాయ‌ని మంత్రి తెలిపారు. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన వెంట‌నే స్పాజ్ పెన్ష‌న్ కోటాలో వితంతువులతో పాటు ఆరోగ్య పెన్ష‌న్లు కూడా పంపిణీ చేస్తున్న విష‌యం జ‌గ‌న్మోహ‌న్‌ రెడ్డి తెలుసుకోవాల‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 2.50 ల‌క్ష‌ల మందికి కొత్త‌గా పెన్ష‌న్లు మంజూరు చేయ‌గా… ఒక్క పెన్ష‌న్ ఇవ్వ‌లేద‌ని.. 6 ల‌క్ష‌ల పెన్ష‌న్లు తొల‌గించారంటూ అబ‌ద్ధ‌పు ప్ర‌చారం చేయ‌డంలో జ‌గ‌న్మోహ‌న్‌ రెడ్డి ఆరితేరిపోయార‌ని మంత్రి ఎద్దేవా చేశారు. జ‌గ‌న్మోహ‌న్‌ రెడ్డి ప్ర‌భుత్వం 5 ఏళ్లలో పెన్ష‌న్ల కోసం 91 వేల కోట్లు ఖ‌ర్చు చేస్తే కూట‌మి ప్ర‌భుత్వంలో 22 నెల‌ల్లోనే పెన్షన్ల కోసమే రికార్డు స్థాయిలో రూ. 63,157 కోట్లు ఖర్చు చేశామ‌ని కూడా మంత్రి తెలిపారు. గ‌తంలో ఎప్పుడూ లేన‌ట్టుగా మూడు నెల‌ల పెన్ష‌న్లు కూడా ఒకేసారి తీసుకునే స‌ద‌వ‌కాశం కూడా పెన్ష‌న‌ర్ల‌కు కూట‌మి ప్ర‌భుత్వం క‌ల్పించింద‌ని మంత్రి తెలిపారు. జ‌గ‌న్మోహ‌న్‌ రెడ్డి అబ‌ద్ధ‌పు ప్ర‌చారాల‌ను రాష్ట్ర ప్ర‌జ‌లు ఎవ్వ‌రూ న‌మ్మ‌వ‌ద్ద‌ని మంత్రి ఈ సంద‌ర్భంగా సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈ నెల 30న పేద‌లకు ప‌ట్టాభిషేకం..

– సీఎం చేతుల మీదుగా పండ‌గ వాతావ‌ర‌ణంలో ప‌ట్టాల పంపిణీ – తొలిద‌శ‌లో 24,042 మంది ల‌బ్ధిదారుల‌కు ప‌ట్టాలు – …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *