-ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే ప్రయత్నాలు ఆపాలని స్పష్టంచేసాం.
-స్త్రీ-శక్తి పథకం విజయవంతానికి కొత్త బస్సులు, సిబ్బంది నియామకాలు చేపట్టాలి.
-సిబ్బందిపై దాడులను అరికట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
-12 AAS వల్ల మెకానిక్‌లకు ఆర్థిక నష్టం కలగకుండా చూడాలని విజ్ఞప్తి.
-స్త్రీ శక్తి అమలులో సిబ్బంది టికెట్లు ఇచ్చుటలో కలుగుతున్న ఇబ్బందు లను తొలగించాలని విజ్ఞప్తి.
-ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని కృష్ణబాబు హామీ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర సచివాలయం, అమరావతి నందు శుక్రవారం TR&B స్పెషల్ చీఫ్ సెక్రటరీ మరియు ఇన్‌చార్జ్ PTD కమిషనర్ & ఆర్టీసీ ఎండీ ఎం.టి. కృష్ణబాబు తో ఆర్టీసీ గుర్తింపు ఉద్యోగ సంఘాలైన ఏపిపీటిడీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ (NMUA) మరియు ఏపిపీటిడీ ఎంప్లాయీస్ యూనియన్ (EU) రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ఆర్టీసీలో ప్రవేశపెట్టే ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీ ద్వారానే నిర్వహించాలని, విలువైన ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రక్రియను నిలిపివేయాలని కోరడమైనది.
అలాగే స్త్రీ-శక్తి పథకం అమలుతో ఉద్యోగులకు ఏర్పడుతున్న ఇబ్బందులను తొలగించాలని, 3000 కొత్త బస్సులను ప్రవేశపెట్టి 10,000 ఉద్యోగ నియామకాలు వెంటనే చేపట్టాలని విజ్ఞప్తి చేయడమైనది. స్త్రీ-శక్తి పథకం మరింత విజయవంతం కావడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరడమైనది.
సిబ్బందిపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, దాడులకు పాల్పడిన వారిపై కఠిన శిక్షలు విధించాలని సమావేశంలో డిమాండ్ చేయడమైనది. మెకానిక్‌లకు 12 AAS వల్ల కలిగిన ఆర్థిక నష్టాన్ని భర్తీ చేసి, లీడింగ్ హ్యాండ్ స్కేల్ అమలు చేయాలని కోరడమైనది. ఉద్యోగ భద్రత సర్క్యులర్ నెం.01/2019ను అమలు చేసి ఉద్యోగులకు విధిస్తున్న తీవ్రమైన శిక్షల నుంచి విముక్తి కల్పించాలని విజ్ఞప్తి చేయడమైనది. కాలం చెల్లిన TIMS స్థానంలో కొత్త TIMS అందించాలని, కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాలలో ఆర్టీసీ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని కోరడమైనది. ఉద్యోగులకు సంబంధించిన సంక్షేమము వైద్యము ప్రమోషన్లు తదితర అంశముల మీద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో కమిటీ ఏర్పాటు చేసి కమిటీ రిపోర్టు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అమలుకు చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేసి ఉన్నారు
అంతేకాకుండా, రెండు గుర్తింపు సంఘాలు సమర్పించిన మెమోరాండాల్లోని అన్ని అంశాలపై ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ ఏర్పాటు చేసి సమగ్ర చర్చలు జరపాలని కోరడమైనది.
ఆర్టీసీ ప్రైవేటీకరణపై ఉద్యోగులు ఆందోళన చెందవద్దని, ఉద్యోగుల ఆందోళనలను సీఎం గారి దృష్టికి తీసుకెళ్తామని కృష్ణబాబు హామీ ఇచ్చారు. అయినప్పటికీ, ఈ చర్చల సారాంశాన్ని ఇతర సంఘాలతో చర్చించి, ఆర్టీసీ ప్రైవేటీకరణపై స్పష్టమైన హామీ కోసం భవిష్యత్ ఆందోళన కార్యక్రమాలపై చర్చించి తదుపరి నిర్ణయాలు ప్రకటిస్తామని సమావేశం అనంతరం మీడియాతో NMUA రాష్ట్ర అధ్యక్షులు వై. శ్రీనివాసరావు, ఆర్టీసీ EU రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు, NMUA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.వి. రమణారెడ్డి, ఆర్టీసీ EU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి. నరసయ్య తెలిపారు.
ఈ సమావేశంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ED (అడ్మిన్) బ్రహ్మనందరెడ్డి, ED (ఆపరేషన్స్) ఎం.వై. దానం, ED (ఇంజనీరింగ్) జి.వి. రవివర్మ, FA & CAO సుధాకర్, CPM శ్రీధర్, జయశంకర్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News