అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా నల్లపాడు – బండారుపల్లి స్టేషన్ల మధ్యన చేపట్టిన చినపలకలూరు ROB [రోడ్ ఓవర్ బ్రిడ్జి] నిర్మాణానికి గాను గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి, స్థానిక ఎమ్మెల్యే బి. రామాంజనేయులు తో కలిసి శంకుస్థాపన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు.
ఎంపీగా, కేంద్ర సహాయ మంత్రిగా పెమ్మసాని బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు నుంచి గుంటూరు, పరిసర ప్రాంత ప్రజల ట్రాఫిక్ సమస్యల పరిష్కారం పైనే దృష్టి సారించారు. అందుకు అనుగుణంగా చేసిన ప్రయత్నాలతో గుంటూరు జిల్లాలో 7 ఆర్.ఓ.బి. లను పెమ్మసాని మంజూరు చేయించారు. అందులో భాగంగా రూ. 49.95 కోట్ల నిధులతో చినపలకలూరు ROB నిర్మాణానికి పెమ్మసాని నేడు శ్రీకారం చుట్టారు.
పెమ్మసాని మాట్లాడుతూ…
* గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి చేస్తుందని చెప్పడానికి సంతోషిస్తున్నాం.
* కల్తీ మద్యం, గుంతల రోడ్లు, ఉద్యోగాలు లేని యువత వంటి అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్న రాష్ట్ర ప్రజలకు అభివృద్ధిని మరోసారి మన కూటమి ప్రభుత్వం పరిచయం చేస్తుంది.
* ఇంతటి సేవ చేసేందుకు అవకాశం, ఈ కేంద్ర సహాయ మంత్రిగా ఇచ్చిన బాధ్యతకు ప్రజల రుణం ఎలా తీర్చుకోవాలి అన్న ఆలోచన నుంచి వచ్చిన నిర్ణయమే గుంటూరు పార్లమెంటు పరిధిలో ఏడు ROBల నిర్మాణానికి శ్రీకారం చుట్టేలా చేసింది.
* మాకు ఈ అవకాశాన్ని కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, ఈ ఆర్ ఓ బిల మంజూరుకు సహకరించిన సోమన్న కి, అశ్విని వైష్ణవ్ కి హృదయపూర్వక ధన్యవాదాలు.
* వీరందరి సహకారంతో ఈ రోజున మన జిల్లాలో మూడో ROB శంకుస్థాపనను చేయబోతున్నాం.
* త్వరలోనే మంగళగిరి ఆర్ఓబి కి కూడా శంకుస్థాపన చేయబోతున్నాం.
* అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రాష్ట్రంలో ఎక్కడా లేని అంత వేగంగా గుంటూరు పార్లమెంటు పరిధిలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి.
* 2014 – 19 మధ్యన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రైల్వే బడ్జెట్ కి సుమారు రూ. 800 కోట్లకు పైగా మంజూరు చేస్తే..
* 2026 – 27 సంవత్సరానికి మాత్రమే రూ. 10 వేల కోట్ల రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది.
* అమృత్ భారత్ స్టేషన్ పథకం గాని, ఆర్ఓబీలు గాని, రైల్వే జోన్ వంటి ఎన్నో సదుపాయాలను మన రాష్ట్రానికి తీసుకు రాగలిగాము.
* గుంటూరులోని GGH లో రూ. 18 కోట్ల విలువైన పెట్ స్కాన్, వెంటిలేటర్లు, సర్వీస్ బ్లాకులు వంటి దాదాపు కొన్ని వందల కోట్ల విలువైన అభివృద్ధి పనులు అమలు చేస్తున్నాం.
* గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోడ్లు, డ్రైన్ల నిమిత్తం రూ. 400 కోట్ల నిధులతో పనులు చేస్తున్నాం.
* సౌకర్యాలు లేని, మూతపడినటువంటి పలు కాలేజీలను అభివృద్ధి చేసి యువతకు ఉపయోగపడేలా స్కిల్ డెవలప్మెంట్ శిక్షణా తరగతులను అందుబాటులోకి తీసుకొస్తున్నాం.
* మానస సరోవర్, రైతు బజార్, నార్ల వెంకటేశ్వరరావు ఆడిటోరియంతో పాటు ఎన్నో ప్రభుత్వ స్కూళ్లలో టాయిలెట్లు కాంపౌండ్ వాళ్ళు తదితర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకొని అమలు చేస్తుంది.
* విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో పదో తరగతిలో పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు అద్భుతమైన మార్కులతో తమ ప్రతిభను కనబరిచారు.
* మన గుంటూరులో తీసుకుంటే సుమారు 39 మంది విద్యార్థులను ఇలా ప్రతిభ కనపరిచిన వారిలో ఎంపిక చేసి ఢిల్లీ పర్యటనను, ఉపరాష్ట్రపతితో సమావేశం అయ్యే అవకాశాన్ని కల్పించామంటే అది కూటమి ప్రభుత్వపు గొప్పతనమేనని గుర్తుంచుకోవాలి.
* మరి ఇన్ని వేలకోట్ల అభివృద్ధి పనులు అద్భుతమైన అవకాశాలు వైసిపి ప్రభుత్వం లో ఎందుకు రాలేదు అని ప్రజలు ఒక్కసారి ప్రశ్నించుకోవాలని విన్నవించుకుంటున్నాను.
* ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ – 3 నిర్మాణానికి గాను 800కు పైగా నివాసితులకు ఇబ్బంది కలగకుండా తరలించి, ప్రత్యామ్నాయాలు చూపించి, నష్టపరిహారం చెల్లించి ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టాము.
* ఇంతటి శ్రమతో తీసుకువచ్చిన ఈ ROB నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అధికారులకు కాంట్రాక్టర్లకు సూచిస్తున్నాం.
ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ …
* తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలకు వెళ్లాలంటే ఈ గేటు దాటి వెళ్లాల్సిందే.
* ఆ ప్రాంతాలకు ఈ గేట్ వే పాయింట్ ను దాటి వెళ్లాల్సిందే.
* ఎలాంటి సమస్యలు వచ్చినా, విద్యార్థులు ఇబ్బందులు పడినా రైలు మాత్రం తన పని తాను చేసుకుని వెళ్లాల్సిందే.
* అలాంటి సమస్యలను గుర్తించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆర్వోబి(ROB)ని తీసుకువచ్చిన ఘనుడు మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు.
* ప్రజల సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కారాలు కూడా చూపించే పెమ్మసాని లాంటి నాయకుడు దొరకడం మన అదృష్టం.
కార్యక్రమం అనంతరం రైల్వే డిఆర్ఎం సుధేష్ణ సేన్, స్థానిక ఎమ్మెల్యే రామాంజనేయులు తో కలిసి గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నిర్మాణానికి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో రైల్వే DRM సుధేష్ణ సేన్, ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, గుంటూరు జిల్లా బిజెపి అధ్యక్షులు తిరుపతయ్య, టిడిపి జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్య రావు, జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, జడ్పీ చైర్ పర్సన్ హెరి క్రిస్టియనా, టిడిపి నాయకులు ఉద్యోగాల సీతారామయ్య, మున్సిపల్ కమిషనర్ మయూర్ అశోక్, ప్రతిభ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త కొర్రపాటి నాగేశ్వరరావు అలాగే టిడిపి జనసేన బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News