Breaking News

Daily Archives: September 25, 2024

న్యూయార్కులో వివిధ సంస్థల ప్రతినిధులతో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ

-రైతుల సంక్షేమం, వాతావరణ మార్పుల అంశాలపై విస్తృత చర్చ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎపి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమెరికాలోని న్యూ యార్కులో పలుదేశాలకు చెందిన వాణిజ్య, ఎన్జీవో సంస్థలకు (యుకె, ఆస్ట్రేలియా, అమెజాన్ ఫారెస్ట్ మొదలైనవి) చెందిన ప్రతినిధులతో సమావేశమయ్యారు. జనరల్ అట్లాంటిక్ ఫౌండేషన్ ప్రతినిధి కారా బార్నెట్ , ములగో ఫౌండేషన్స్ సి.ఇ.ఓ. కెవిన్ స్టర్, మరియు బియాండ్ నెట్ జీరో …

Read More »

వచ్చే నెల మొదటి వారంలో విజయవాడలో ఇన్సూరెన్సు లోక్ అదాలత్

-బుడమేరు వరదల్లో దెబ్బతిన్న మోటారు వాహనాల బీమా క్లైమ్ల పరిష్కారానికి చక్కని వేదిక -రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ ఎమ్.బబిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల మొదటి వారంలో సంభవించిన బుడమేరు వరదల వల్ల విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలు జలమయము అయిన కారణంగా దెబ్బదితిన్న పలు మోటారు వాహనాల భీమా క్లైమ్ల సత్వర పరిష్కారానికై వచ్చే నెల 1 నుండి 7 వరకు విజయవాడలో ఇన్సూరెన్సు లోక్ అధాలత్ ను నిర్వహించనున్నామని, వరధ బాదితులు అందరూ …

Read More »

న్యూఢిల్లీలో నిర్వహించిన స్వచ్ఛతా హి సేవ, 2024 ప్రచారానికి హాజరైన అశ్విని వైష్ణవ్

-పరిశుభ్రత, పర్యావరణ సుస్థిరత కోసం మంత్రిత్వ శాఖ అధికారులచే ప్రతిజ్ఞ చేయించిన మంత్రి -సూచనా భవన్‌లో ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమం కింద ఒక మొక్కను నాటిన అశ్విని వైష్ణవ్ -పరిసరాల పరిశుభ్రతకు సమాజ సేవా సంకల్ప ఆచరణ చాలా ముఖ్యం : అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్వచ్ఛతా హి సేవ- 2024 ప్రచార కార్యక్రమంలో భాగంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (CBC) ఆధ్వర్యంలో …

Read More »

రాష్ట్రంలో భారతీయ తయారీ విదేశీ మధ్యం (ఐఎంఎఫ్ఎల్) నిల్వలకు కొరత లేదు

-అందుబాటులో 20 రోజులకు సరిపడా నిల్వలు : అబ్కారీ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో భారతీయ తయారీ విదేశీ మధ్యంకు (ఐఎంఎఫ్ఎల్) ఎటువంటి కొరత లేదని అబ్కారీ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ తెలిపారు. వినియోగానికి అవసరమైన మేరకు నిల్వలు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయన్నారు. సాధారణంగా 90,000 కేసుల ఐఎంఎఫ్ఎల్, 23,000 కేసుల బీరు రాష్ట్రంలో రోజువారీ సగటు వినియోగంగా ఉందని, ప్రస్తుతం ఉన్న నిల్వలు కనీసం 20 రోజుల వరకు సరిపోతాయని స్పష్టం …

Read More »

స్వచ్ఛత హి సేవ 2024లో అగ్రస్ధానంలో ఆంధ్ర ప్రదేశ్

-స్వచ్చ ఆంధ్ర కార్పొరేషన్ ఎండి గంధం చంద్రుడు -మెడికల్ క్యాంపుల నిర్వహణలో ప్రధమ స్దానం -స్వచ్ఛంధ బాగస్వామ్యంలో ద్వితీయ స్దానం మన సొంతం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛత హీ సేవ 2024 కార్యక్రమం అమలులో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా దూసుకుపోతుందని స్వచ్చ ఆంధ్ర కార్పొరేషన్ మానేజింగ్ డైరెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. ఈనెల 17వ తేదీన పక్షం రోజుల కార్యక్రమంగా దేశ వ్యాప్తంగా దీనిని ఘనంగా ప్రారంభించగా, రాష్ట్రంలో స్వచ్చత పట్టణాలు, గ్రామలే ధ్యేయంగా చేపడుతున్న పనులు దేశంలోనే రాష్ట్రాన్ని ప్రధమ …

Read More »

వరద బాధితులపై బోండా ఉమా అనుచరుల దాడి హేయం

-వైసీపీ నగర అధ్యక్షులు మల్లాది విష్ణు -ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద బాధితులపై ఎమ్మెల్యే బోండా ఉమా అనుచరుల దాడి హేయమని వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. భారీ వర్షాలు, వరదలకు నగర ప్రజలు సర్వం కోల్పోయి జీవచ్ఛవాలుగా మిగిలారని.. అటువంటి వారిపై దాడికి తెగబడటం సిగ్గుచేటన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలు మాట్లాడే స్వేచ్ఛను కూడా కోల్పోయారని.. పశ్చిమ ప్రాంతంలో ఎన్యుమరేషన్ జరగలేదని రోడ్డెక్కిన భవానీపురం కరకట్టవాసులపై పోలీసులు …

Read More »

ప్రణాళిక బద్ధంగా దసరా ఉత్సవాల ఏర్పాట్లు

-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి అధికారులను ఆదేశించారు. అక్టోబర్‌ 3నుంచి 12వరకు జరిగే అమ్మవారి దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఆలయ ఈఓ కె ఎస్ రామారావు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర,శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్, గద్దె రామ్మోహన్ రావు , పోలీసు ఉన్నతాధికారులు అగ్నిమాపక సిబ్బంది సంబంధిత అధికారుల తో బుదవారం తాడిగడప లోని తమ కార్యాలయంలో సమావేశం …

Read More »

క్యాన్సర్ బాధిత చిన్నారికి వై ఎన్ ఆర్ చారిటీస్ ఆపన్న హస్తం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారికి వైఎన్ఆర్ చారిటీస్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేశారు. మధురానగర్ లో నివాసముంటున్న చిన్నారి కీర్తన గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతూ హైదరాబాదులోని యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది. నిరుపేద కుటుంబం అయిన తమకి సాయం అందించాలని వై ఎన్ ఆర్ చారిటీస్ చైర్మన్ యలమంచిలి జయప్రకాష్ ను చిన్నారి కుటుంబ సభ్యులు సంప్రదించగా ఆయన సానుకూలంగా స్పందించారు. బుధవారం పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా …

Read More »

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం

-శాసనసభ్యులు సుజన చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) అన్నారు. “ఇది మంచి ప్రభుత్వం” 5 వ రోజు కార్యక్రమం 54 వ డివిజన్ వించిపేటలో బుధవారం ప్రారంభించగా ఎమ్మెల్యే సుజనా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 100 రోజుల ఎన్డీఏ పాలనలో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనేక సంక్షేమ …

Read More »

సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

-ఎమ్మెల్యే సుజన చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తోటి వారికి సాయపడాలనే మంచి మనసుతో వరద బాధితుల సహాయార్థం నిత్య అవసరాలను అందిస్తున్న ఇన్ఫోసిస్ ఫౌండేషన్, శ్రీ రామకృష్ణ సేవాశ్రమ సేవలు అభినందనీయమని పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) అన్నారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్, ఆధ్వర్యంలో శ్రీరామకృష్ణ సేవాశ్రమ సారధ్యంలో బుధవారం ఊర్మిళా నగర్ లోని హెచ్2ఓ ఫంక్షన్ హాల్ లో వరద బాధితులకు నిత్యవసరాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుజనా హాజరై బాధితులకు నిత్య అవసరాలను తమ …

Read More »