–జ్వరంతోనే వరద ప్రభావిత ప్రాంతాలలో పారిశుద్ధ్య నిర్వహణపై సమీక్ష విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైరల్ జ్వరం, తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారు. అస్వస్థతతో ఉన్నప్పటికీ గురువారం ఉదయం తన నివాసంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ అధికారులతో సమావేశమయ్యారు. వరద పరిస్థితిపై సమీక్షించారు. వరద నీరు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని, సూపర్ క్లోరినేషన్ చేపట్టాలని ఆదేశించారు. అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం, దోమల బెడద తీవ్రత ఉన్నందున పారిశుద్ధ్య నిర్వహణ …
Read More »Monthly Archives: September 2024
వరద బారినపడ్డ ప్రతి కుటుంబానికీ నిత్యావసర సరకులు ఇచ్చే బాధ్యత తీసుకుంటాము
-విజయవాడలో ముంపులో ఉన్న ఇళ్లకు వెళ్ళి నిత్యావసర సరకులు అందించిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద ప్రభావంతో అతలాకుతలమైన ప్రతి కుటుంబానికీ నిత్యావసరాలను అందించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. శుక్రవారం నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర సరుకుల కిట్లను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ట్రయల్ రన్ ను గురువారం విజయవాడలో నిర్వహించారు. మనోహర్ తోపాటు పౌర …
Read More »జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలు పరిశీలనకు విచ్చేసిన భారత డిప్యూటీ సెక్రెటరీ అషీస్ గుప్త
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా నందు అమలు జరుగుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల పట్ల భారత గ్రామీణ అభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీ ఆశిష్ గుప్తా సంతృప్తి వ్యక్తం చేసి పేదలకు నరెగా ఒక గొప్ప వరం అని పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనుల అమలు తీరును పరిశీలించుటకు మూడు రోజుల పర్యటన నిమిత్తం విచ్చేసిన వీరు ముందుగా జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ ను స్థానిక …
Read More »విపత్తు ప్రభావిత(నాచురల్ కలామిటీ) జిల్లాగా ప్రకటించి రుణాల రీ షెడ్యూలింగ్‌కు ఎస్‌ఎల్‌బిసి కి సిఫార్సు…
-బ్యాంకర్లు, బుణాల రీ షెడ్యూలింగ్, కొత్త బుణాల మంజూరుకు సహకరించి ఆధుకోవాలి.. -వాహనాల బీమా పై ఇన్స్‌రెన్స్ కంపెనీలు సహకరించాలి.. -జిల్లా కలెక్టర్, డిసిసి చైర్మన్ డా. జి. సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకృతి వైపరిత్యం కింద విపత్తు ప్రభావిత జిల్లాగా ప్రకటించి రుణాల రీ షెడ్యూలింగ్ కు ఎస్‌ఎల్‌బిసి కి సిఫార్సు చేయడంతో పాటు బ్యాంకర్లు, బుణాల రీ షెడ్యూలింగ్, కొత్త బుణాల మంజూరుకు సహకరించి ఆధుకోవాలని జిల్లా కలెక్టర్, డిసిసి చైర్మన్ డా. జి. సృజన సమావేశంలో …
Read More »అధైర్యపడొద్దు.. అన్ని విధాలా ఆదుకుంటాం
– పూర్తిస్థాయిలో నష్టాన్ని మదించి.. ప్రభుత్వ సహాయానికి చర్యలు. – గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి మార్గనిర్దేశనంతో అహర్నిశలు శ్రమిస్తున్నాం. – 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమ్ నుంచి నిరంతర పర్యవేక్షణ. – అన్ని బృందాలనూ సమన్వయపరుచుకుంటూ పనిచేస్తున్నాం. – ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా సహాయక చర్యలు చేపడుతున్నాం. – పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చే పనుల్లో నిమగ్నమైన అధికార యంత్రాంగం – 10 వేల మంది సిబ్బందితో శరవేగంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు – ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.సృజన విజయవాడ, …
Read More »స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ ముందుండి సిబ్బందిని నడిపిస్తున్న గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ లో వరద ప్రభావిత ప్రాంతాలను పూర్వస్థితికి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని గుంటూరు నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణల ఆదేశాల మేరకు విజయవాడలోని 62 వ డివిజన్ పైపుల రోడ్ లో చేపట్టిన ప్రత్యేక పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ వరద ముంపుకు గురైన విజయవాడను పూర్వస్థితికి తెచ్చేందుకు ప్రత్యేక కార్మిక బృందాలతో కృషి చేస్తున్నామన్నారు. …
Read More »4 వ రోజు తూర్పు గోదావరి జిల్లా నుంచి విజయవాడ వరద బాధితులకు సహాయం
-55 వాహనాల ద్వారా బియ్యం, ఆహార పదార్థాలు, పాలు, బిస్కెట్స్ రుస్క్ లు, తాగునీరు అందించడం జరిగింది -విరివిగా సహాయం అందించేందుకు ముందుకు వస్తున్న దాతలు -సెప్టెంబరు 6 వ తేదీకి సంబంధించి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా నుంచి 4500 క్వింటాళ్ల బియ్యం ను 18 వేల బస్తాల ద్వారా విజయవాడ వరద బాధితులకు సహాయార్థం పంపించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి గురువారం సాయంత్రం ఒక ప్రకటనలో …
Read More »“మినీ జాబ్ మేళా”
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రనైపుణ్యాభివృద్ది సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ అధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా లోని నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించుటకు గాను చేపడుతున్న “మినీ జాబ్ మేళా” లో భాగంగా, గురువారం NAC బొమ్మూరు , రాజమండ్రీ “మినీ జాబ్ మేళ” నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నైపణ్యాదికారి ఎమ్ కొండలరావు మరియు జిల్లా ఉపాధి అధికారి హరీష్ చంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ యువకులకు జాబ్ మేళాల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని అందరూ …
Read More »వరద బాధితులను ఆదుకోవడంలో మేము సైతం అంటూ రాజమండ్రి సెంట్రల్ జైల్ ఖైదీలు
-25,000 మంది బాధితులకు టమాటా బాత్ ప్యాకెట్లు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీలు మేము సైతం అంటూ పెద్దమనసుతో సాయానికి ముందడుగు వేశారు. జైలు పర్యవేక్షణాధికారి ఎస్ రాహుల్ నేతృత్వంలో పాతిక వేల మందికి టమాటా బాత్ (ఉప్మా) ప్యాకెట్లు సిద్ధం చేసి గురువారం తెల్లవారు జామున విజయవాడకు పంపించారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి ప్రశాంతి వారి ఆదేశాల మేరకు, జైళ్ల శాఖ డీజీ కుమార్ విశ్వజిత్ ప్రోద్బలంతో ఖైదీలు శ్రమించి …
Read More »భారతీయ సంస్కృతి లో విద్య నేర్పించిన గురువులది ప్రథమ స్థానం..
-సమాజంలో ప్రతి ఒక్కరి విజయం వెనుక వారిని తీర్చిదిద్దిన మహోన్నతమైన వ్యక్తి టీచర్. -70 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు -జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : భారతీయ సంస్కృతిలో గురువు స్థానం ఎంతో విశిష్టమైనది, గౌరవప్రదమైనదని, ప్రతి ఒక్కరి విజయం వెనుక వారిని తీర్చిదిద్దిన మహోన్నతమైన వ్యక్తి గురువు అని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ముఖ్య అతిథిగా …
Read More »
Prajavartha Online Telugu News