-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, పార్లమెంటులో సిపిఐ పక్షనేత, ఎంపి సంథోష్ కుమార్ ఈ నెల 6వ తేదీన విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వెల్లడిరచారు. ఈ మేరకు కె.రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల సంభవించిన వరదల కారణంగా ఎన్‌టిఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాలలో పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ముఖ్యంగా విజయవాడ నగరంలో వరద భీభత్సం సృష్టించింది. లక్షలాది మంది …
Read More »Monthly Archives: September 2024
అధిక ధరలపై ఈనెల 6న సిపిఐ తలపెట్టిన ధర్నాలు వాయిదా
-వరద బాధితుల సహాయార్థం నిధి వస్తువులు సేకరించాలని పార్టీ శ్రేణులకు పిలుపు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అధిక ధరలు తగ్గించాలని కోరుతూ ఈనెల ఆరవ తేదీన భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలను వరదల కారణంగా వాయిదా వేయడమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. వరద బీభత్సం లక్షలాది మందికి కన్నీళ్లు …
Read More »ఘనంగా జిల్లాస్థాయి ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో, ఉత్తమ సమాజ నిర్మాణంలో, తద్వారా సమాజాభివృద్ధికి ఉపాధ్యాయులు దిక్సూచి వంటి వారని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కీ.శే. స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో గురువారం స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో జిల్లాస్థాయి ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్, శాసనమండలి సభ్యులు కేఎస్. లక్ష్మణరావు, డి ఈ ఓ తహెరా సుల్తానా తదితర …
Read More »వరద బాధితులకు అండగా ఉంటాం..
-పంట నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం -ప్రతి కుటుంబానికీ 25 కిలోల బియ్యం, లీటర్ పామాయిల్, కిలో చక్కెర, రెండేసి కిలోల ఉల్లిపాయలు, బంగాళదుంపలు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో అధిక వర్షాలు, ఎగువ నుంచి వచ్చిన వరదల కారణంగా ముంపు బారిన పడిన ప్రజలందరికీ అన్ని విధాలుగా అండగా నిలిచి ఆదుకుంటామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గురువారం సాయంత్రం మచిలీపట్నం నగరం 50వ డివిజన్ లోని సుందర్ నగర్, …
Read More »వరద బాధితుల సహాయార్థం 3 లక్షల రూపాయల విరాళం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వరద బాధితుల సహాయార్థం 3 లక్షల రూపాయల విరాళం అందించేందుకు పాఠశాల విద్యార్థులు, యాజమాన్యం ముందుకు రావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు గురువారం మధ్యాహ్నం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో కానూరుకు చెందిన షామిరాక్ ఇంటర్నేషనల్ పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు కలిసికట్టుగా 3 లక్షల రూపాయల బ్యాంకు చెక్కును జిల్లా కలెక్టర్కు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ సుమన్ త్యాగరాజ్ జిల్లా కలెక్టర్ కు వివరిస్తూ తమ పాఠశాల విద్యార్థులు …
Read More »నగరపాలక సంస్థ వారు పైప్ లైన్ ద్వారా సరఫరా చేస్తున్న నీరును కేవలం వాడుటకు మాత్రమే ఉపయోగించండి…
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్.ఎం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్.యం గురువారం ఉదయం వరద ప్రభావిత ప్రాంతాలలో విజయవాడ నగరపాలక సంస్థ వారు పైప్ లైన్ ద్వారా సరఫరా చేస్తున్న నీరును కేవలం వాడుటకు మాత్రమే ఉపయోగించవలసిందిగా ప్రజలను కోరారు. కబేలా, ఊర్మిళ నగర్, ఐరన్ యార్డ్ , నైజాం గేట్, పాత రాజరాజేశ్వరి పేట, కంసాలిపేట, కొత్త రాజరాజేశ్వరి పేట, నందమూరి నగర్, ఇంద్ర నాయక్ నగర్, సింగ్ నగర్, …
Read More »డ్రోన్ లతో బ్లీచింగ్ లిక్విడ్స్ స్ప్రే చెయ్యండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో బ్లీచింగ్ చేయడం ద్వారా ప్రజలను అనారోగ్య సమస్యల నుండి కాపాడవచ్చని, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్.యం గురువారం ఉదయం డ్రోన్ల సహాయంతో బ్లీచింగ్ లిక్విడ్ ను స్ప్రే చెయ్యమని అధికారులను ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం ఉదయం వరద ప్రభావిత ప్రాంతాలలో బ్లీచింగ్ స్ప్రే చేయటం ద్వారా ప్రజలను అనారోగ్యం బారిన పడకుండా ఉండవచ్చని, అతి తక్కువ సమయంలో వీలైనంత …
Read More »మంత్రి కొలుసు పార్ధసారధి పరామర్శ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణలంక ప్రాంతంలోని బ్రమరాంబ పురానికి చెందిన పి.చంద్రశేఖర్ బుడమేరు వాగులో కొట్టుకు పోయి చనిపోయిన పి.చంద్రశేఖర్ కుటుంబాన్ని రాష్ట్ర గృహ నిర్మాణం,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి గురువారం పరామర్శించారు. ఎంబిఎ చదువుకున్న చంద్రశేఖర్ తన డైరీ ఫారంలో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులను వరదల నుంచి కాపాడి ప్రమాదవాసాత్తు తను వాగులో కొట్టుకు పోయి మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి పార్ధసారధి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబ సభ్యులను ధైర్యంగా ఉండాలని …
Read More »39 వ జాతీయ నేత్ర దాన పక్షోత్సవాల ర్యాలీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ : డా.ఎస్.వెంకటేశ్వర్
-నేత్రదానం చేయండి మరో ఇద్దరికి చూపు లేని వారికి చూపు ప్రసాదించండి: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 25 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు 39వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల నిర్వహణ నేపథ్యంలో ర్యాలీ ప్రారంభించి నేత్రదానం చేయండి మరో ఇద్దరికి చూపు లేని వారికి చూపు ప్రసాదించండి అని జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక రుయా ఆసుపత్రి నుండి ఎస్వీ మెడికల్ కళాశాల వరకు ఏర్పాటు చేసిన 39 …
Read More »సియం సహాయ నిధికి ఐఏఎస్ అధికారుల భార్యల సంఘం 5 లక్షల రూ.ల చెక్కు సియంకు అందించారు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వరద బాధితుల సహాయార్థం ఐఏఎస్ అధికారుల భార్యల సంఘం (IASOWA) ముఖ్యమంత్రి సహాయ నిధికి 5 లక్షల రూపాయల చెక్కును విజయవాడ కలెక్టరేట్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షురాలు సిఎస్ సతీమణి రేష్మ ప్రసాద్ తోపాటు పద్మ వల్లి, ప్రదా భాస్కర్ తదితరులు సియం ను కలిసి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద బాధితులను ఆదుకునేందుకు తమ వంతు …
Read More »
Prajavartha Online Telugu News