-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్థికంగా వెనుకబడి ఉన్న అగ్ర కులాల పేదలకు(ఈడబ్ల్యూఎస్ వర్గీయులు) కూటమి ప్రభుత్వం అండగా ఉంటోందని, వారి పేదరికాన్ని పారదోలేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ప్రతి కుటుంబం నుంచి ఒకరిని పారిశ్రామిక వేత్తులు తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా ఈడబ్ల్యూఎస్ యువతకు ఎంఎస్ఎంఈ పార్కుల్లో ప్రాధాన్యమిస్తున్నామన్నారు. తాడేపల్లిలో కమ్మ కార్పొరేషన్ కార్యాలయాన్ని మంత్రి సవిత గురువారం …
Read More »Daily Archives: April 23, 2026
హంతకుల ఫ్యాక్టరీ వైసీపీ
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -ఉత్తమ నాయకులను, కార్యకర్తలను తీర్చిదిద్దుతున్న టీడీపీ -వైసీపీ మాత్రం రప్పారప్పా అంటోంది… -చంపడం, బెదిరించడం జగన్ పార్టీకి అలవాటే -జగన్ ది సైకోయిజం -పెద్ద దస్తగిరి భార్యకు సమాధానం చెప్పే ధైర్యం జగన్ కు లేదు -అందుకే ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు : మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీ ఉత్తమ నాయకులను, కార్యకర్తలను తయారు చేస్తుంటే, వైసీపీ హంతకుల ఫ్యాక్టరీగా మారిందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ …
Read More »భగీరథుని స్ఫూర్తితో రాష్ట్రంలో జల సంరక్షణ
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తాడేపల్లి/అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భగీరథ మహర్షీ స్ఫూర్తితో రాష్ట్రంలో జల సంరక్షణను ఉద్యమంగా చేపట్టామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. అపర భగీరథుడు సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో ఇప్పటికే భారీ ఎత్తున సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారన్నారు. ఏపీకి గుండెకాయ లాంటి పోలవరం నిర్మాణం పూర్తయితే రాష్ట్ర రూపు రేఖలే మారిపోతాయని అన్నారు. భగీరథ మహర్షి జయంతి సందర్భంగా తాడేపల్లిలోని …
Read More »ఎల్వోసీలు అందచేత…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గం 48వ డివిజన్ కి చెందిన గుండు గాయత్రి, 35 వ డివిజన్ కి చెందిన 19 ఏళ్ల చిన్నారి , 52 వ డివిజన్ కు చెందిన వరప్రసాద్ రాజు, 48వ డివిజన్ కి చెందిన దమ్మిడి గాయత్రి అనారోగ్య సమస్యతో బాధ పడుతూ అత్యవసర చికిత్స కోసం ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదించారు. వారందరికీ వైద్య సహాయం కోసం అయ్యే మొత్తాన్ని సహకారం చేయాలని సీఎం సహాయ నిధికి లేఖ రాసారు. దీనికి సంబంధించిన …
Read More »ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలో చలివేంద్రాలు
-మజ్జిగ, తాగునీరు తో ప్రజల దాహార్తి, అలసట ను తీరుస్తున్న సుజనా – సుజలా చలివేంద్రాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలో సుజనా ఫౌండేషన్ సహకారంతో నియోజకవర్గంలోని ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. సుజనా – సుజల పేరిట ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాలలో చల్లని నీటి తో పాటు మజ్జిగ కూడా పంపిణీ చేస్తున్నారు. సుజనా చౌదరి కార్యాలయం రూపొందించిన సుజనా – సుజలా చలివేంద్రాలు ఆయా కూడళ్లలో ప్రత్యేక ఆకర్షణగా …
Read More »ఆస్తి పన్ను వసూళ్లలో మెరుగైన ఫలితాలు సాధనపై జిఎంసి కమిషనర్ ని అభినందించిన రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ మరోసారి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభాపురస్కారాన్ని అందుకుంది. గురువారం విజయవాడలోని ది స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్స్ లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 పై జరిగిన రాష్ట్ర స్థాయి కమిషనర్ల వర్క్ షాప్ లో 2025-26 ఆర్ధిక సంవత్సరానికి ఆస్తి పన్ను వసూళ్లలో రాష్ట్ర స్థాయిలో గుంటూరు నగరపాలక సంస్థ అత్యుత్తమ ఫలితాలు సాధించడంపై రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్, సిడిఎంఏ సంపత్ …
Read More »అంతర్జాతీయ వేదికపై గుంటూరు నగరపాలక సంస్థ ఖ్యాతి – ప్రతిష్టాత్మక ‘4వ UNIDO GEM’ అవార్డు కైవసం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (యునిడో) అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా అందించే “4వ జెండర్ ఈక్వాలిటీ మొబిలైజేషన్ (జిఈఎం) అవార్డు”ను గుంటూరు నగరపాలక సంస్థ దక్కించుకోవడం పట్ల నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ హర్షం వ్యక్తం చేశారు. ఆస్ట్రియా రాజధాని వియన్నాలో బుధవారం యునిడో నిర్వహించిన ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండస్ట్రీస్’ (ఐడిడబ్ల్యుఐ 2026) వేడుకల్లో భాగంగా ఈ పురస్కారాన్ని అందజేశారు. ఫిన్లాండ్ మాజీ అధ్యక్షురాలు తార్జా హాలోనెన్, యునిడో మేనేజింగ్ డైరెక్టర్ సిసిలియా …
Read More »డ్రెయిన్ల పూడికతీత పూర్తి లోతు వరకు తీయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న వర్షాకాలం దృష్ట్యా ముందస్తుగా గుంటూరు నగరంలో మురుగునీటి సమస్యల పరిష్కారానికి చేపట్టిన డ్రెయిన్ల పూడికతీత పనులు నాణ్యతతో, డ్రైన్ పూర్తి లోతు వరకు తీయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. నగరవ్యాప్తంగా ఉన్న సుమారు 3,129.45 కిలోమీటర్ల మొత్తం డ్రైనేజీ నెట్‌వర్క్‌ను దృష్టిలో ఉంచుకుని, అందులో సమస్యాత్మకమైన 179.45 కిలోమీటర్ల మేజర్ మరియు మీడియం డ్రెయిన్లలో 61 పనులను రూ.3.68 కోట్ల అంచనా వ్యయంతో ప్రాధాన్యత క్రమంలో పూడికతీత పనులు …
Read More »ప్రభుత్వాసుపత్రుల్లో ‘ఏఐ’ ఆధారిత వైద్య సేవల ద్వారా మంచి ఫలితాలు
-వైద్య సేవలు, పనితీరు ఆధారంగా ఎంపిక చేసే ఉత్తమ అoకుర సంస్థలకు నగదు ప్రోత్సాహాకాలు -అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన సంస్థకు రూ.కోటి ‘వర్క్ ఆర్డర్’ -మరో 12 సంస్థలకు రూ. 5 లక్షల నుంచి రూ. లక్ష వరకు అందచేత.. -ప్రత్యేక కమిటీ ద్వారా ఆవిష్కరణల పనితీరుపై అధ్యయనం, ఉత్తమ సంస్థల ఎంపిక -ఫలితాల వివరాల వెల్లడికి త్వరలో ప్రత్యేక సదస్సు -వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి -“ఏపీ మెడ్ టెక్ ఛాలెంజ్” విధానాన్ని కొనసాగించే యోచన అమరావతి, నేటి …
Read More »చదువు జీవితాన్ని మార్చే శక్తి.. కృషి, పట్టుదలతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు : విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులు మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి గన్నవరం బాయ్స్ హై స్కూల్ ప్రాంగణంలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అభినందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో విజేతలకు నగదు బహుమతులు అందజేశారు . మాజీ సర్పంచ్ పాలడుగు వెంకట వరప్రసాద్ (నాని) సహకారంతో విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించారు. …
Read More »
Prajavartha Online Telugu News