Breaking News

Daily Archives: April 23, 2026

LPG సిలిండర్లను సక్రమంగా పంపిణీ చేసే విధంగా పటిష్ట చర్యలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత పరిస్థితులలో LPG సిలిండర్లను గృహ వినియోగదారులకు సక్రమంగా పంపిణీ చేసే విధంగా జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటుంది. ఈ విషయంలో ఎటువంటి అవకతవకలు జరిగిన సహించేది లేదు అని శ్రీయుత జాయింట్ కలెక్టర్ వారు తెలియజేసినారు. ఇటీవల కంచకచర్లలోని బాస్కర్ HP గ్యాస్ ఏజన్సీలో అవకతవకలు గుర్తించి అందులోని 9000 పై చిలుకు కలెక్షన్ లను దగ్గరలోని శ్రీ రాజ్యలక్ష్మి HP గ్యాస్ ఏజన్సీకి బదలాయించడం జరిగింది. ఇప్పుడు మరొకసారి విజయవాడ సర్కిల్ 2 …

Read More »

విజ‌య‌వంతంగా జెడ్ఈడీ అవ‌గాహ‌న వ‌ర్క్‌షాప్‌

– జీరో డిఫెక్ట్ – జీరో ఎఫెక్ట్ స‌ర్టిఫికేష‌న్‌తో బ‌హుళ ప్ర‌యోజ‌నాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ ఆటోన‌గ‌ర్‌లోని ఏపీ ఎంఎస్ఎంఈ ఇండ‌స్ట్రియ‌ల్ అసోసియేష‌న్ హాల్‌లో గురువారం ర్యాంప్ (రైజింగ్ అండ్ యాక్సిల‌రేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్‌ఫార్మెన్స్‌) కార్య‌క్ర‌మంలో భాగంగా ఎన్‌టీఆర్ జిల్లాస్థాయి జెడ్ఈడీ (జీరో డిఫెక్ట్ – జీరో ఎఫెక్ట్‌) స‌ర్టిఫికేష‌న్‌పై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం జ‌రిగింది. స్కిల్ ఎక్స్‌ప్రెస్ ఏజెన్సీ స‌మ‌న్వ‌యంతో నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మానికి జిల్లాలోని సూక్ష్మ‌, చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల ప్ర‌తినిధులు పెద్ద సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు. కేంద్ర ఎంఎస్ఎంఈ …

Read More »

ప్ర‌కృతి సాగుతో నేల త‌ల్లి ఆరోగ్యం బాగు

– స‌మ‌తుల ఎరువుల వినియోగంపై దృష్టిపెట్టాలి – రైతుల‌కు విస్తృత స్థాయిలో అవ‌గాహ‌న క‌ల్పించాలి – ధర్తీ మాత బచావో అభియాన్ స‌మావేశంలో కలెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌కృతి సాగుతో నేల‌త‌ల్లి ఆరోగ్యం బాగుంటుంద‌ని.. ఈ సాగు విధానాల‌తో పాటు స‌మ‌తుల ఎరువుల వినియోగంపై రైతుల‌కు పెద్దఎత్తున అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధ్య‌క్ష‌త‌న గురువారం క‌లెక్ట‌రేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్‌లో ధర్తి మాత బచావో అభియాన్ (భూ …

Read More »

వేసవి క్రీడా శిక్షణా శిబిరముల ప్రారంభము

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశములననుసరించి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఎన్.టి.ఆర్ మరియు కృష్ణా జిల్లాల ఆధ్వర్యములో బాస్కెట్ బాల్, బాడ్మింటన్, బాక్సింగ్, ఫుట్ బాల్, హ్యాండ్ బాల్, హాకీ, కబడ్డీ, ఖోఖో, వాలీ బాల్, వెయిట్ లిఫ్టింగ్ వంటి వివిధ క్రీడలకు సంభందించి వేసవి శిక్షణ శిబిరములను మే 01 నుంచి 31 వ తేది వరకు నిర్వహించబడుచున్నవి. సదరు వేసవి శిక్షణా శిబిరములలో ఎన్.టి.ఆర్ మరియు కృష్ణా జిల్లాలకు చెందిన 16 సంవత్సరములలోపు బాల బాలికలు …

Read More »

వ‌న్ స్టాప్ సెంట‌ర్లుగా ప‌శు ఔష‌ధి విక్ర‌య కేంద్రాలు

– అందుబాటులో వెట‌ర్న‌రీ మందులు, అనుబంధ ఉత్ప‌త్తులు – కేంద్రాల ఏర్పాటుకు కొత్త‌గా మూడు సొసైటీల‌కు అనుమ‌తులు – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశుసంవర్ధక రంగ అభివృద్ధిలో కీల‌కమైన పశు ఔషధి విక్ర‌య కేంద్రాలు (పీఏవీకే) వన్ స్టాప్ సెంటర్లుగా సేవ‌లందిస్తాయ‌ని.. వెట‌ర్న‌రీ మందుల‌తో పాటు అనుబంధ ఉత్ప‌త్తులు కూడా ఈ కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. గురువారం క‌లెక్ట‌రేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్‌లో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ …

Read More »

మ‌హ‌ర్షి భగీర‌థుని స్ఫూర్తితో జ‌ల సంర‌క్ష‌ణ‌కు పెద్ద‌పీట‌

– క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గంగను భూమ్మీద‌కు తెచ్చిన మహనీయులు మ‌హ‌ర్షి భగీరథ‌ను స్మరించుకుంటూ సామాజిక బాధ్య‌త‌గా ప్ర‌తిఒక్క‌రూ జ‌ల సంర‌క్ష‌ణ‌లో కీల‌క భాగ‌స్వాములు కావాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. మ‌హ‌ర్షి భ‌గీర‌థ జ‌యంతి సంద‌ర్భంగా జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వ‌ర్యంలో క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో గురువారం జ‌రిగిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో కలెక్ట‌ర్ ల‌క్ష్మీశ అధికారుల‌తో క‌లిసి భ‌గీర‌థుని చిత్ర‌ప‌టానికి పూల మాల‌లు వేసి మ‌హ‌నీయుని స్ఫూర్తి ప‌థాన్ని …

Read More »

2025-2026 పన్ను వసూళ్ళో అత్యధికంగా వసూలు చేసిన విజయవాడ నగరపాలక సంస్థకు పురస్కారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2025-2026 ఆర్థిక సంవత్సరం పన్ను వసూళ్ళో అత్యధికంగా వసూలు చేసిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో అత్యధిక పన్ను వసూళ్లలో ఉత్తమ ప్రదర్శన కనబరిచినందుకు పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్. సురేష్ కుమార్ పురస్కారం అందించారు. గురువారం సాయంత్రం స్కూల్ అఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, జయప్రకాష్ నగర్, విజయవాడలో నిర్వహించిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026, రాష్ట్రస్థాయి మున్సిపల్ కమిషనర్ల వర్క్‌షాప్‌లో ఈ పురస్కారాన్ని …

Read More »

ఎగ్జిబిషన్లో అగ్ని ప్రమాదం జరగకుండా నివారణ చర్యలు కచ్చితంగా పాటించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎగ్జిబిషన్లో అగ్ని ప్రమాదం జరగకుండా నివారణ చర్యలు కచ్చితంగా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ రీజినల్ ఫైర్ ఆఫీసర్ డి. మాల్యాద్రి అన్నారు. ప్రస్తుత వేసవి తీవ్రత, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ఫైర్ ప్రివెన్షన్ టీమ్ గురువారం ఉదయం విధ్యధరపురం, లేబర్ కాలనీ, సితార గ్రౌండ్స్‌లో జరుగుతున్న ఎగ్జిబిషన్ ప్రాంగణాన్ని సిబ్బందితో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్టాళ్లలో ఎవ్వరూ లోపల వంట చేయకూడదని, ఎగ్జిబిషన్ ప్రాంగణం నాలుగు …

Read More »