-వదంతులు వ్యాప్తి చేసే వారిపట్ల చర్యలు -వదంతులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ స్పష్టం చేశారు. జిల్లాలో డీజిల్ కొరతపై వస్తున్న వదంతులపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజలకు అవసరమైన మేరకు ఇంధన సరఫరా నిరంతరం …
Read More »Daily Archives: April 26, 2026
ఎండల తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎండల తీవ్రత పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని, జిల్లాలోను 45 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు చలివేంద్రియాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మండల, జిల్లా కార్యాలయాల్లోనూ చలివేంద్రియాలు ఏర్పాటు చేయాలని అన్నారు. జనకూడలి ప్రదేశాల్లోనూ, …
Read More »1100 టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేయండి… ఆర్జీల పరిస్థితి తెలుసుకోండి
-పి.జి.ఆర్.ఎస్ ను వినియోగించుకోండి గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : 1100 టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి, పి.జి.ఆర్.ఎస్ లో సమర్పించిన ఆర్జీల పరిస్థితి తెలుసుకోవచ్చని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్)ను వినియోగించుకోవాలని కోరారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు తమ దరఖాస్తులను పి.జి.ఆర్.ఎస్ తో పాటు మీకోసం”వెబ్ సైట్ లో ఆన్ లైన్ లోను సమర్పించవచ్చని తెలిపారు. అర్జీల వివరాలు Meekosam.ap.gov.in (మీకోసం డాట్ …
Read More »పాత్రికేయులకు నిజాయితీయే కవచం
-ప్రముఖ జర్నలిస్టు ఎస్ వెంకట్ నారాయణ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జర్నలిస్టులు నిజాయితీగా ఉంటే ఎవరికి భయపడనవసరం లేదని, సమాజంలో తలెత్తుకు తిరగవచ్చని, అందరూ గౌరవిస్తారని ప్రముఖ జర్నలిస్ట్ వెంకట్ నారాయణ్ (83) అభిప్రాయపడ్డారు.ఆయన ఆదివారం ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడ రాగా ఏపీయూడబ్ల్యూజే నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ప్రెస్ క్లబ్ కు ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన గత ఆరు దశాబ్దాల కాలంలో జర్నలిజంలో తన అనుభవాలను యూనియన్ నేతలతో పంచుకున్నారు. తాను ఇప్పటివరకు 68 దేశాల్లో పర్యటించానని, …
Read More »కొత్తపేటలో రెండో రోజు సుజనా ఫౌండేషన్ మొబైల్ మెడికల్ క్యాంప్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కొత్తపేట లో సుజనా ఫౌండేషన్ మొబైల్ మెడికల్ క్యాంపు లో విశేషంగా ప్రజలు పాల్గొన్నారు.. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని కొత్తపేట కేబిఎన్ కళాశాలలో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొబైల్ మెడికల్ వ్యాన్ల ద్వారా ఉచిత మెడికల్ క్యాంపు ఆదివారం కూడా కొనసాగింది.., ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన మెడికల్ క్యాంపు లో 52, 53 డివిజన్ల ప్రజలు విస్తృతంగా పాల్గొన్నారు.. క్యాంప్ ద్వారా పలు ఆరోగ్య సమస్యలకు సంబంధించిన వైద్య పరీక్షలు, చికిత్స సహాయం …
Read More »2వ రోజు కొనసాగిన ఫ్యాప్టో నిరాహార దీక్ష
-ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం! విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఫ్యాప్టో మలిదశ పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనగా 26వ తేది విజయవాడ ధర్నా చౌక్ నందు జరిగిన నిరాహార దీక్ష విజయవంతమైనదని ఫ్యాప్టో చైర్మన్ ఎల్.సాయి శ్రీనివాస్, సెక్రటరీ జనరల్ ఎస్. చిరంజీవి ఒక ప్రకటన విడుదల చేశారు. దీక్షకు అధ్యక్షత వహించిన ఫ్యాప్టో చైర్మన్ ఎల్.సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ 12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని, ఏకీకృత …
Read More »అసాధారణ పట్టుదలతో ఎవరెస్ట్ శిఖరాన్ని ముద్దాడిన ప్రత్యేక ప్రతిభావంతులు
-అంగవైకల్యాన్ని జయించి.. ఎవరెస్ట్ ను అధిరోహించిన తెలుగు తేజాలు -విజయవంతంగా 21 మంది దివ్యాంగ విద్యార్థుల ఎవరెస్ట్ శిఖరారోహణ! -దివ్యాంగుల బృందంతో ట్రెక్కింగ్.. ప్రపంచంలోనే తొలిసారి -వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం -అభినందించిన విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ -హర్షం వ్యక్తం చేసిన విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఉన్నతాధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు -“సరిగ్గా నడవలేడు, వినపడదు.. ఈ అబ్బాయి కొండలు ఎక్కుతాడా?” లేదా “ఇంత కష్టమైన పని నీకెందుకు, ఇంట్లో కూర్చోవచ్చు కదా” వెటకారపు మాటలు.. – ” దినసరి కూలీల …
Read More »పెట్రోలు, డీజిల్ కొరత లేకుండా పటిష్ట చర్యలు తీసుకున్నాం
-అపోహలు నమ్మవద్దు – అవసరానికి మించి కొనొద్దు -డిమాండ్ కు తగ్గట్లు సరఫరాకు ప్రభుత్వం చర్యలు -రైతులకు ఇబ్బందులు లేకుండా వ్యవసాయ అవసరాలకు ప్రాధాన్యం – బ్లాక్ మార్కెట్ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు -ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ఇంధనానికి కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని.. అపోహలు నమ్మవద్దని, ఆందోళనతో అవసరానికి మించి కొనుగోలు చేయవద్దు అని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు. జిల్లాలో రోజువారీ …
Read More »“ఆరోగ్యకరమైన ఆహారం – ఆరోగ్యకరమైన జీవితం”
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ సహకారంతో హ్యాపీ సండే లో భాగంగా వన్ ఎర్త్ వన్ లైఫ్ (టెర్రస్ గార్డెన్ గ్రూప్) ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద నిర్వహించిన “Organic Vegetables – Farmer to Consumer” కార్యక్రమం విజయవంతంగా జరిగింది. “ఆరోగ్యకరమైన ఆహారం – ఆరోగ్యకరమైన జీవితం” అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రసాయన రహిత, సేంద్రియంగా పండించిన కూరగాయలు మరియు ఆకుకూరలను నేరుగా రైతుల నుండి వినియోగదారులకు అందుబాటు ధరల్లో …
Read More »ఈ నెల 27న పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 27వ తేదీ సోమవారం కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం … పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ చేపడుతునున్నట్టు తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు …
Read More »
Prajavartha Online Telugu News