అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ముంబయిలో నిర్వహించిన శస్త్ర చికిత్స విజయవంతం అయింది. ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడు డా.దిన్షా పార్థీవాలా నేతృత్వంలోని వైద్యుల బృందం శ్రీ పవన్ కళ్యాణ్ గారి కుడి భుజానికి సర్జరీ నిర్వహించారు. రొటేటర్ కఫ్ ఇంజ్యూరీతోపాటు, భుజానికి అవల్షన్ ఫ్రాక్చర్ ఉండటంతో భారీ సర్జరీ చేయాల్సి వచ్చింది. ఈ సర్జరీకి మూడున్నర గంటల సమయం పట్టింది. ఆపరేషన్ థియేటర్ నుంచి రికవరీ రూమ్ కి …
Read More »Daily Archives: July 11, 2026
వైభవంగా జేఎన్‌టీయూ-జీవీ ప్రథమ స్నాతకోత్సవం
-గవర్నర్ చేత పట్టాలు, స్వర్ణ పతకాల ప్రదానం – మయూర్ పట్నాలకు గౌరవ డాక్టరేట్ ప్రదానం విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం–గురజాడ, విజయనగరం (జేఎన్‌టీయూ-జీవీ) ప్రథమ స్నాతకోత్సవం శనివారం విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో అత్యంత వైభవంగా, అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్, జేఎన్‌టీయూ-జీవీ ఛాన్సలర్ ఎస్. అబ్దుల్ నజీర్ అధ్యక్షత వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (APSCHE) ఛైర్మన్ ప్రొఫెసర్ ఎం. మధుమూర్తి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. నిర్మాన్ …
Read More »వియత్నాం పడవ ప్రమాదంపై మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి
-బాధితులకు తక్షణ సహాయం అందించాలని అధికారులకు ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. ఈ ప్రమాద ఘటనను అత్యంత సీరియస్‌గా తీసుకున్న మంత్రి, అందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పర్యాటకులు చిక్కుకున్నారనే ప్రాథమిక సమాచారంపై తక్షణమే రంగంలోకి దిగారు. ఈ విషయమై ఢిల్లీలోని ఏపీ భవన్ సీనియర్ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ అత్యవసరంగా మాట్లాడారు. ఘటనకు సంబంధించిన పూర్తి …
Read More »ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రి కొలుసు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్ సమావేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో గృహ నిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, గౌరవ రెవెన్యూ, రిజిస్ట్రేషన్ & స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ శనివారం ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, ఉద్యోగుల సంక్షేమం, సేవా సంబంధిత అంశాలు, పెండింగ్‌లో ఉన్న డిమాండ్లపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మొత్తం 23 …
Read More »గోదావరి పుష్కరాలు– 2027ను దేశంలోనే ఆదర్శంగా నిర్వహించేందుకు సమన్వయంతో శాశ్వత అభివృద్ధి పనులు చేపడతాం
– పురపాలక శాఖ మంత్రి డా. పి. నారాయణ, పర్యాటక, సాంస్కృతిక & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : గత గోదావరి పుష్కరాల్లో సుమారు 4 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేయగా, ఒక్క రోజే 68 లక్షల మంది స్నానాలు చేసిన నేపథ్యంలో, ఈసారి 12 రోజుల పుష్కరాల్లో దాదాపు 10 కోట్ల మంది యాత్రికులు గోదావరి తీరం చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి డా. పి. …
Read More »ఏడాది ముందే పుష్కర వ్యూహం… గోదావరి తీరాన ఆధ్యాత్మిక వైభవానికి కూటమి ప్రభుత్వ సమగ్ర కార్యాచరణ
-సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశంతో 2027 గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు -ఆరు జిల్లాల్లో భక్తులకు అత్యున్నత సౌకర్యాలు – భద్రత, పారిశుధ్యం, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి -రాజమహేంద్రవరంలో పుష్కర ఘాట్లు, రివర్ ఫ్రంట్, మౌలిక సదుపాయాల పనులను పరిశీలించిన మంత్రులు పి. నారాయణ, కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే 2027 గోదావరి పుష్కరాలను దేశంలోనే ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక మహోత్సవంగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం ఏడాది ముందుగానే సమగ్ర కార్యాచరణను ప్రారంభించిందనీ …
Read More »ఘనంగా ఎస్ఎస్ జీ వార్షిక క్రీడల పోటీలు
-ముఖ్య అతిథిగా హాజరైన ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్రలడ్హా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ విభాగంలోని స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ వార్షిక క్రీడల పోటీలు ఘనంగా జరిగాయి. మంగళగిరిలోని ఎస్ఎస్ జీ గ్రౌండ్స్ లో నిర్వహించిన ఈ క్రీడా పోటీలకు ముఖ్య అతిథిగా అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహేష్ చంద్ర లడ్హా, ఐజీ పీహెచ్ డీ రామకృష్ణ తదితర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ డైరెక్టర్ ఏ.జగదీష్, ఎస్పీ చెన్నుపాటి భద్రయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన …
Read More »ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్స
-రెండు భుజాలకీ రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్… తొలుత కుడి భుజానికి శస్త్ర చికిత్స -మూడున్నర గంటలపాటు శస్త్ర చికిత్స -2016లో తగిలిన గాయాలకు తోడు… పోరాట యాత్ర నుంచి గత ఎన్నికల ప్రచారం వరకూ పార్టీ శ్రేణులు, అభిమానులు చేతులుపట్టి లాగడంతో తీవ్రమైన రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శనివారం ఉదయం ముంబయిలో శస్త్ర చికిత్స జరిగింది. ఆయన రెండు భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ తీవ్రంగా ఉన్నాయి. ఇటీవల …
Read More »డెంగ్యూ అవగాహన ర్యాలీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ రూరల్ మండలం, రామవరప్పాడు -1 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం పరిధిలో డెంగ్యూ అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. డెంగ్యూ నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక అవగాహన ర్యాలీ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎం,హెల్త్ అసిస్టెంట్లు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ప్రదర్శన నిర్వహించి, డెంగ్యూ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సబ్ యూనిట్ ఆఫీసర్ B G అప్పారావు గారు …
Read More »పారిశ్రామిక అవసరాలకు మిగులు ఇథనాల్ విక్రయంపై మార్గదర్శకాలు పరిశీలన
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న మిగులు ఇథనాల్‌ను ఔషధ, పెయింట్స్, రసాయన పరిశ్రమలు తదితర పారిశ్రామిక అవసరాలకు వినియోగించేలా తగిన మార్గదర్శకాలు రూపొందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ అంశంపై గనులు, భూగర్భశాఖ మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షతన సచివాలయంలో ఇథనాల్ తయారీదారుల సంఘం ప్రతినిధులతో సమావేశం జరిగింది. సమావేశంలో ఇథనాల్ తయారీదారుల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగినప్పటికీ, ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (EBP) కార్యక్రమం కింద …
Read More »
Prajavartha Online Telugu News