Breaking News

Daily Archives: July 25, 2026

అధికారులు.. సిబ్బందికి మంత్రి సత్యకుమార్ అభినందనలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : మంత్రి వస్తున్నారంటే… ప్రొటోకాల్, హడావుడి, దూరంగా నిలబడే అధికారులు, సిబ్బంది… ఇవే సాధారణంగా కనిపించే దృశ్యాలు. కానీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వ్యవహారశైలి మాత్రం ఇందుకు భిన్నంగా కనిపించింది. కర్నూలు జిల్లా ఆస్పిరి పీహెచ్సీ లో శనివారం సాయంత్రం సంజీవని ప్రారంభ కార్యక్రమం ముగిసిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఉద్యోగులు ఫొటో కోసం ముందుకొచ్చారు. హడావుడి లేకుండా, వారిలో ఒకరిగా నిలబడి అందరితో కలిసి మంత్రి ఫొటో దిగారు. కార్యక్రమం విజయవంతంగా …

Read More »

సింహపురి ఈ-బస్సు డిపోలో పవర్ రూమ్ ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

-రవాణా రంగంలో PM e- Bus Sewa తో నూతన శకం మొదలు -ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలు విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పర్యావరణహిత, ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. శనివారం విశాఖపట్నంలోని సింహపురి ఈ-బస్సు డిపోలో పవర్ రూమ్‌ను ప్రారంభించి, డిపోలో ఏర్పాటు చేస్తున్న సబ్‌స్టేషన్, ఛార్జింగ్ స్టేషన్ తదితర మౌలిక …

Read More »

సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

-స్వామి వారి దయతో కూటమి ప్రభుత్వ హయాంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి -ఆలయ మర్యాదలతో మంత్రికి EO వెంకట్రావు, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీవాసచార్యులు పూర్ణకుంభంతో మర్యాదపూర్వక స్వాగతం పలికారు -మండపంలో రాతి సానలపై చందనం చెక్కలను గంధం అరగదీసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సింహాచలం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నేడు విశాఖపట్నంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం, సింహాచలంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ …

Read More »

10 కోవిడ్ కేసుల నమోదు

-గుంటూరులో ముగ్గురు.. ఎన్టీఆర్‌లో ఇద్దరికి పాజిటివ్‌ -రాష్ట్రంలో మొత్తం కేసులు 49.. -ఆసుపత్రుల్లో 24 మందికి చికిత్స అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో శనివారo పది కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో ముగ్గురు, ఎన్టీఆర్‌ జిల్లాలో ఇద్దరు, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, తిరుపతి, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరికి చొప్పున కోవిడ్ సో కింది. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 49కు చేరింది. ఇప్పటివరకు 302 మందికి పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్య శాఖ శనివారం సాయంత్రం …

Read More »

సంజీవని ద్వారా ఇంటిoటికి ఆరోగ్య రక్షణ…

-41 రకాల పరీక్షలు ఉచితం.. రూ.3 వేల వరకు ఖర్చు ఆదా -వ్యాధి నిర్ధారణ నుంచి మందులు, పైస్థాయి వైద్యం, నిరంతర పర్యవేక్షణ వరకు ఒకే వ్యవస్థ -సీఎం శ్రీ చంద్రబాబు నేత్రత్వoలో రాష్ట్రం పురోగతి -ఆస్పరి సభలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : జబ్బు వచ్చిన తర్వాత ఆసుపత్రిలో చికిత్స చేయడానికే పరిమితమైన వైద్య విధానాన్ని మార్చి.. ప్రజలు అనారోగ్యం బారిన పడకముందే ముప్పును గుర్తించి కాపాడే సమగ్ర ఆరోగ్య వ్యవస్థకు రాష్ట్ర …

Read More »

80 ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో క‌లుషిత నీటి శుద్ధి ప్లాంట్లు

-రూ.83 కోట్ల వ్య‌యం అంచ‌నా -బ‌యో మెడిక‌ల్ వేస్ట్ నిర్వ‌హ‌ణ నియ‌మాల ప్ర‌కారం జ‌ర‌గాలి -ఆసుప‌త్రుల్లో ఇన్ఫెక్ష‌న్ నిరోధానికి ర‌ద్దీని త‌గ్గించాలి -మెరుగైన ఆసుప‌త్రుల నిర్వ‌హ‌ణ కోసం ప‌లు ఆదేశాలు జారీ చేసిన వైద్యారోగ్య శాఖ మంత్రి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో జీవ వైద్య వ్య‌ర్ధాల నిర్వ‌హ‌ణ‌( బ‌యో మెడిక‌ల్ వేస్ట్ మేనేజ్ మెంట్), క‌లుషిత నీటి శుద్ధీక‌ర‌ణ పూర్తిగా చ‌ట్టాలు, నియ‌మాల‌కు అనుగుణంగా జ‌ర‌గాల‌ని వైద్యారోగ్య శాఖా మంత్రి శ్రీ స‌త్య‌కుమార్ యాద‌వ్ స్ప‌ష్టం చేశారు. ఆసుప‌త్రుల్లో ప‌రిశుభ్ర‌మైన …

Read More »

ఆర్థిక అవగాహనతోనే ఆర్థిక భద్రతకు భరోసా…

-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ దిశానిర్దేశంతో జిల్లావ్యాప్తంగా ఆర్థిక విద్యా కార్యక్రమాల నిర్వహణ -విజయవాడ ఆర్డీవో వెన్నెల శ్రీను విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలందరిలో ఆర్థిక పరిజ్ఞానాన్ని పెంపొందించి, సురక్షితమైన బ్యాంకింగ్ సేవల వినియోగం, ప్రభుత్వ ఆర్థిక సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ వారి మార్గదర్శకత్వంలో జిల్లావ్యాప్తంగా ఫైనాన్షియల్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నట్లు విజయవాడ ఆర్డీవో వెన్నెల శ్రీను అన్నారు. శనివారం లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ కార్యాలయం ఆధ్వర్యంలో కృష్ణలంక కమ్యూనిటీ హాలో లో ఆర్థిక …

Read More »

పంచ సూత్రాల‌తో ఎల్‌నినోను ఎదుర్కొందాం..

– ఉద్యాన పంట‌ల‌ను శాస్త్రీయ ప‌ద్ధతుల‌తో సంర‌క్షించుకుందాం – జిల్లా ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎల్‌నినో ప్ర‌భావం వ‌ల్ల త‌క్కువ వ‌ర్ష‌పాతం, అధిక ఉష్ణోగ్ర‌త‌లు, అధిక కాలం పొడి వాతావ‌ర‌ణం ఉంటుంద‌ని.. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఉద్యాన పంట‌ల‌ను సంర‌క్షించుకునేందుకు శాస్త్రీయ ప‌ద్ధ‌తుల‌తో పంచ సూత్రాల‌ను అవ‌లంబించాల‌ని జిల్లా ఉద్యాన అధికారి పి.బాలాజీ కుమార్ శ‌నివారం ఓ ప్ర‌క‌ట‌న‌లో సూచించారు. ప‌రిమితి నీటి వ‌న‌రులున్న మామిడి తోట‌లు, మిర‌ప సాగు ఆల‌స్య‌మ‌య్యే ప్రాంతాల్లో ప్రీ మాన్సూన్ డ్రై …

Read More »

నైపుణ్యాల‌ను నేర్చుకొని సృజ‌న‌తో ఎద‌గండి..

– లెర్న్ – క్రియేట్ – ఎర్న్.. మ‌హిళా సాధికారతకు కొత్త దిశ – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలు నైపుణ్యాలను పెంపొందించుకుని సృజనాత్మకతతో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలని, ఆర్థిక స్వావలంబన సాధించి కుటుంబంతో పాటు సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. శ‌నివారం ఇబ్ర‌హీంప‌ట్నం మండ‌లం, గుంటుప‌ల్లి రైజ్ కేంద్రంలో పైప్ క్లీన‌ర్ (మెత్తని చెనిల్ వస్త్రంతో చుట్టిన వంగే తీగ)తో త‌యారు చేసే హ‌స్త‌క‌ళా …

Read More »

ఉత్తమ గ్రంథ పాలకురాలి అవార్డు అందుకున్న కే.రమాదేవి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘ పద్మశ్రీ అయ్యంకి వెంకటరమణయ్య 136 వ జయంతి కార్యక్రమం శనివారం మచిలీపట్నం నందు నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఏప్రిల్ 28 నుంచి జూన్ 6 వరకు నిర్వహించిన వేసవి విజ్ఞాన శిబిరం 40 రోజులు ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు వివిధ అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇప్పించి దిగ్విజయంగా నిర్వహించినందుకు గాను కె రమాదేవి గ్రంథాలయాధికారి ఠాగూర్ గ్రంథాలయంకు ఎమ్మెస్ బేగ్ కృష్ణా జిల్లా గ్రంధాలయ సంస్థ, అయ్యంకి మురళి కృష్ణ అయ్యంకి వెంకటరమణయ్య మనవడు, వి …

Read More »