Breaking News

సింహపురి ఈ-బస్సు డిపోలో పవర్ రూమ్ ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

-రవాణా రంగంలో PM e- Bus Sewa తో నూతన శకం మొదలు
-ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలు

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో పర్యావరణహిత, ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. శనివారం విశాఖపట్నంలోని సింహపురి ఈ-బస్సు డిపోలో పవర్ రూమ్‌ను ప్రారంభించి, డిపోలో ఏర్పాటు చేస్తున్న సబ్‌స్టేషన్, ఛార్జింగ్ స్టేషన్ తదితర మౌలిక సదుపాయాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తొలి ఏకాదశి రోజున రాష్ట్రం లో మొదటి E – బస్ పవర్ రూమ్ ప్రారంభం నూతన శకానికి నాంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేపట్టడంపట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎలక్ట్రిక్ ప్రజా రవాణాను వేగంగా విస్తరిస్తున్నామని తెలిపారు. PM e-Bus Sewa పథకం కింద రాష్ట్రానికి తొలి దశలో 750 ఎలక్ట్రిక్ బస్సులు రానుండగా, అందులో విశాఖపట్నానికి 100 బస్సులు కేటాయించినట్లు చెప్పారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, గుంటూరు నగరాల్లో దశలవారీగా ఈ-బస్సులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

ఏపీఎస్‌ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని, కూటమి ప్రభుత్వం ఉన్నంతకాలం సంస్థను మరింత బలోపేతం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. అనంతరం మంత్రిగారిని డిపో కమిటీలు, కార్మికుల సంఘం సభ్యులు ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు, ఇంజినీర్లు, డిపో మేనేజర్లు, ఉద్యోగులు, వివిధ ఆర్టీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వ్యవసాయాభివృద్ధికి శాస్త్రీయ పరిశోధనలు, సహజ వ్యవసాయమే భవిష్యత్‌కు మార్గం

-రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *