-ఈ అభ్యర్థిత్వంపై CM సానుకూలంగా స్పందించారు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థకు త్వరలో జరగనున్న మేయర్ ఎన్నికల నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు, యువ నాయకులు బొండా సిద్ధార్థ గురువారం అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కలిసి మేయర్ అభ్యర్థిత్వానికి సంబంధించిన బయోడేటాను అందజేశారు. ఈ సందర్భంగా బొండా సిద్ధార్థ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా యువతను తెలుగుదేశం పార్టీ …
Read More »Daily Archives: September 3, 2026
జనసేన పార్టీ జాయినింగ్స్ కమిటీలో డా. పసుపులేటి హరిప్రసాద్‌కు కీలక బాధ్యతలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ బలోపేతం, విస్తరణ లక్ష్యంగా పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 14 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక జాయినింగ్స్ కమిటీని ప్రకటించారు. ఇతర రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, విద్యావంతులు, సామాజికవేత్తలు, యువత, వివిధ రంగాల ప్రముఖులు జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో, వారి చేరికలను సమన్వయం చేసి పార్టీ సిద్ధాంతాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను ఈ కమిటీ నిర్వహించనుంది. ఈ …
Read More »కమిషనర్ ధ్యానచంద్రను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థకు నూతనంగా చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్‌గా నియమితులైన డాక్టర్ నిర్మల గౌరీ గురువారం ఉదయం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్‌లో కమిషనర్ ధ్యానచంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర డాక్టర్ నిర్మల గౌరీకి శుభాకాంక్షలు తెలియజేసి, నగర ప్రజలకు మెరుగైన వైద్య, ప్రజారోగ్య సేవలు అందించేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
Read More »80-విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 80-విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల నమోదు అధికారి (ERO) మరియు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ధ్యానచంద్ర అధ్యక్షతన గురువారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం కమాండ్ కంట్రోల్ రూమ్‌లో నిర్వహించారు. ఈ సమావేశం లో Special Intensive Revision (SIR-2026)కు సంబంధించిన ప్రస్తుత పురోగతి, చేపడుతున్న చర్యలు, శిక్షణ కార్యక్రమాలు, తదుపరి కార్యాచరణపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. భారత ఎన్నికల సంఘం సవరించిన షెడ్యూల్ ప్రకారం క్లెయిమ్స్ మరియు అభ్యంతరాల దాఖలు …
Read More »పరిశుభ్రత, ప్రజారోగ్య ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి
-నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ప్రజారోగ్య విభాగం అధికారులు నగరంలోని 27, 37వ డివిజన్ల పరిధిలో మటన్, చికెన్ షాపులు, హోటళ్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. 27వ డివిజన్ పరిధిలోని దుర్గాపురం ప్రాంతంలో మటన్, చికెన్ షాపులను అధికారులు తనిఖీ చేసి, షాపుల్లో మాంసం నిల్వ మరియు విక్రయ విధానం, పరిసరాల పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యం తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. …
Read More »స్క్యూ బ్రిడ్జి అండర్‌పాస్‌ను సుందరీకరించాలి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్క్యూ బ్రిడ్జి అండర్‌పాస్‌ను సుందరీకరించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం నగరంలో తన పర్యటనలో భాగంగా లబ్బీపేట, రామలింగేశ్వరనగర్, కృష్ణలంక, రాణిగారి తోట తదితర ప్రాంతాల్లో పర్యటించిన కమిషనర్ క్షేత్రస్థాయిలో వివిధ ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్క్యూ బ్రిడ్జి వద్ద ఉన్న అండర్‌పాస్‌ను పరిశీలించిన కమిషనర్, అక్కడ పేరుకుపోయిన డెబ్రిస్‌ను పూర్తిగా తొలగించాలని అధికారులను ఆదేశించారు. …
Read More »సెప్టెంబర్ 5న విజయవాడ “ఏ కన్వెన్షన్ సెంటర్”లో రాష్ట్రస్థాయి గురుపూజోత్సవం
-పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి -183 మంది ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రొఫెసర్లకు అవార్డుల ప్రదానం -జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ కేంద్రంగా సెప్టెంబర్ 5వ తేదీన ఏ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి గురుపూజోత్సవ కార్యక్రమం ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ గురువారం కలెక్టరేట్‌లోని ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గురుపూజోత్సవ కార్యక్రమాన్ని పండుగ …
Read More »జయంతిపురంలో ఎం.ఎస్.ఎం.ఈ. పార్క్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
-రాష్ట్ర ముఖ్యమంత్రి వర్చువల్ ప్రారంభోత్సవం నాటికి అన్ని మౌలిక వసతులతో పార్క్‌ను సిద్ధం చేయాలి -జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో ఏర్పాటు చేస్తున్న ఎం.ఎస్.ఎం.ఈ. (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల) పార్క్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఏపీఐఐసీ అధికారులను ఆదేశించారు. గురువారం జగ్గయ్యపేట జయంతిపురంలో నిర్మాణంలో ఉన్న ఎం.ఎస్.ఎం.ఈ. పార్క్‌ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. పార్క్‌లో చేపడుతున్న …
Read More »సెప్టెంబర్ 5, 6 తేదీల్లో జిల్లాలోని 1,936 పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు
-ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR–2026)లో క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణకు ప్రత్యేక అవకాశం -జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మశా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెప్టెంబర్ 5, 6 తేదీల్లో జిల్లాలోని 1,936 పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశా సీఈఓ వివేక్ యాదవ్ కు వివరించారు. తొలుత ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)- 2026 ముసాయిదా జాబితాలో అందిన క్లెయిమ్‌లు మరియు అభ్యంతరాల పరిష్కారం, తుది జాబితా తయారీపై గురువారం రాష్ట్ర సచివాలయంలోని …
Read More »పేద వర్గాలకు మెరుగైన వైద్యం అందించాలి
-ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి -ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందితే పేదలకు ఆర్థిక భారం తప్పుతుంది -జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశా జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : జగ్గయ్యపేట ఏరియా ఆసుపత్రిలో పేదలు, సామాన్య ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు ఆసుపత్రి పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశా వైద్యాధికారులు, సిబ్బందిని ఆదేశించారు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశా జగ్గయ్యపేట ఏరియా ఆసుపత్రిని గురువారం ఆకస్మికంగా సందర్శించి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, …
Read More »
Prajavartha Online Telugu News