-లీడర్షిప్ కాంక్లేవ్‌లో భవిష్యత్ కార్యాచరణకు దిశానిర్దేశం -స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులను సన్నద్ధం చేయడంపై దృష్టి మంగళగిరి, అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక లీడర్షిప్ కాంక్లేవ్ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో పార్టీ నాయకత్వ పనితీరును సమీక్షించడంతో పాటు, మరింత చురుకైన నాయకత్వాన్ని తీర్చిదిద్దే …
Read More »Daily Archives: September 7, 2026
సంక్షేమాన్ని మాటల్లోనే కాదు…గణాంకాల్లో కూడా చూపిస్తున్నాం
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మంగళగిరి/అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు తమ ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నామని, ప్రతి కుటుంబానికి అండగా ఉన్నామనే భరోసా కల్పిస్తున్నామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో కేవలం రెండేళ్లలో 90 శాతం అమలు చేశామని, మాటల్లో కాకుండా గణాంకాల్లో కూడా చూపిస్తున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. రైతు, మహిళ, విద్యార్థి, బీసీ, మత్స్యకారుడు, చేనేత కార్మికుడు, దివ్యాంగుడు.. ఇలా ప్రతి వర్గానికీ అండగా నిలుస్తున్నామన్నారు. మంగళగిరిలోని టీడీపీ …
Read More »913 ఆశా పోస్టుల భర్తీకి ఆమోదం
-మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి -కూటమి ప్రభుత్వ హయాంలో ఇప్పటికే 1,294 పోస్టుల భర్తీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల ముంగిటకు వైద్య సేవలు చేరువ చేయడంలో కీలకంగా వ్యవహరించే ఆశా ( సామాజిక ఆరోగ్య కార్యకర్త-Accredited Social Health Activists) కార్యకర్తల్లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 913 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. వీటి భర్తీతో రాష్ట్రంలోని ఆశా పోస్టులన్నీ భర్తీ అయినట్లవుతుందని పేర్కొన్నారు. జీరో వెకెన్సీ విధానంలో …
Read More »ప్రతి ఫిర్యాదుకు శాశ్వత పరిష్కారం అందించాలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) డా. డి. చంద్రశేఖర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదును అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిర్ణీత గడువులోగా శాశ్వత పరిష్కారం చూపాలని అదనపు కమిషనర్ అన్నారు. సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి, ఫిర్యాదుదారులకు సమస్య పరిష్కార వివరాలను తెలియజేయాలని సూచించారు. ఈ వారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదికలో …
Read More »విజయవాడ నగరంలో ఘనంగా స్వచ్ఛ వాయు దివస్ నిర్వహణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని మూడు సర్కిళ్లలో స్వచ్ఛ వాయు దివస్‌ను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వన్‌టౌన్‌లోని గాంధీజీ మున్సిపల్ స్కూల్, న్యూ రాజరాజేశ్వరిపేటలోని దేవినేని వెంకటరమణ హైస్కూల్, కృష్ణలంకలోని వీఎంఆర్ స్కూల్‌లలో విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ, వాయు కాలుష్య నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) డా. డి. చంద్రశేఖర్ మాట్లాడుతూ, నగరంలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పర్యావరణహిత చర్యలు చేపట్టాలని …
Read More »స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌లో జాతీయ స్థాయిలో బెస్ట్ పెర్ఫార్మింగ్ వార్డుగా విజయవాడ 60వ వార్డు కు ద్వితీయ ర్యాంక్
-రాష్ట్రస్థాయిలో 31 వ వార్డుకు బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్ గా అవార్డు -భారత రాజధాని ఢిల్లీలో అవార్డు అందుకున్న కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థకు మరో ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MoEFCC) ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (NCAP)లో భాగంగా నిర్వహించిన స్వచ్ఛ వాయు సర్వేక్షణ్–2026లో విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని 60వ వార్డు జాతీయ స్థాయిలో బెస్ట్ …
Read More »వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ–2026 కార్యాలయ ప్రారంభోత్సవంలో మంత్రి సత్య కుమార్ యాదవ్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి నగరంలో నిర్వహించనున్న శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవాలు–2026కు సంబంధించిన మహోత్సవ కమిటీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ హాజరయ్యారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం మహోత్సవ కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ… విఘ్నాలను తొలగించే శ్రీ విఘ్నేశ్వర స్వామివారి …
Read More »జ్యువల్ నిధి నూతన జ్యువెలరీ షోరూమ్ ప్రారంభోత్సవంలో డా. పసుపులేటి హరిప్రసాద్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన జ్యువల్ నిధి జ్యువెలరీ షోరూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొని నూతన షోరూమ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ… నేటి పోటీ ప్రపంచంలో ప్రజల అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా …
Read More »ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కి రేణిగుంట విమానాశ్రయంలో సాదర స్వాగతం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కి సోమవారం ఉదయం తిరుపతి సమీపంలోని రేణిగుంట విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన డా. పసుపులేటి హరిప్రసాద్, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి పవిత్రతను …
Read More »శాలివాహనుల రక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి…
-రాష్ట్ర శాలివాహన సంఘం డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అల్ప ఆదాయ వర్గాలకు చెందిన శాలివాహన కమ్యూనిటీపై జరుగుతున్న దాడులు వేధింపులను అరికట్టి తమకు రక్షణ కల్పించాలని రాష్ట్ర శాలివాహన సంఘం అధ్యక్షుడు ఐలాపురం భాస్కర్ శ్రీనివాస్, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తమ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో పిఠాపురంలో పంచాయతీరాజ్ ఏఈగా పనిచేస్తున్న తెల్లపూడి నూకరాజు మరియు వారి కుటుంబ సభ్యులు …
Read More »
Prajavartha Online Telugu News