Breaking News

Daily Archives: September 11, 2026

రోడ్లపై వాహనాలు నిలిపి డ్రైనేజీలను అడ్డుకోవద్దు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ప్రజారోగ్య విభాగం అధికారులు శుక్రవారం అరండల్‌పేట ప్రాంతంలో రోడ్లపై వాహనాలను నిలిపి డ్రైనేజీ మార్గాలను, ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగించే విధంగా ఆక్రమణలకు పాల్పడుతున్న ఆటో కన్సల్టెంట్లపై చర్యలు చేపట్టారు. 25వ డివిజన్ అరండల్‌పేటలోని పలు ఆటో కన్సల్టెన్సీల వద్ద రోడ్లపై వాహనాలను పెద్ద సంఖ్యలో నిలిపి ఉంచడం వల్ల మురుగునీటి కాలువలను శుభ్రపరిచే పనులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. వాహనాల కారణంగా కాలువలపైకి …

Read More »

వార్డుల పెంపుపై 14 అభ్యంతరాలు స్వీకరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో వార్డుల సంఖ్యను 64 నుంచి 86కు పెంచే ప్రతిపాదనపై ప్రజల నుంచి మొత్తం 14 అభ్యంతరాలు అందినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం నాడు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు . ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డుల పునర్విభజనకు సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసి, ఈ ప్రాథమిక నోటిఫికేషన్‌పై ప్రజలు తమ అభ్యంతరాలు, సూచనలు తెలియజేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని . ఈ నేపథ్యంలో నగరంలోని వివిధ …

Read More »

ప్రతి శుక్రవారం డ్రైడే పాటించి దోమల వల్ల కలిగే వ్యాధులను నిర్మూలిద్దాం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులను సమర్థవంతంగా నివారించేందుకు ప్రతి ఇంటిలో ప్రతి శుక్రవారం డ్రై డేను తప్పనిసరిగా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ సూర్యకుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం దావు బుచయ్య కాలనీ, మధురా నగర్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించి ఇంటింటికీ వెళ్లి ప్రజలకు దోమల నివారణపై సూచనలు అందించారు. ఈ సందర్భంగా బయాలజిస్ట్ …

Read More »

మొబైల్ కోర్టులో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ నగరంలో పారిశుద్ధ్యం, ప్రజారోగ్య పరిరక్షణకు విఘాతం కలిగించే చర్యలపై కఠిన చర్యలు కొనసాగిస్తోంది. కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ప్రజారోగ్య విభాగం అధికారులు శుక్రవారం సర్కిల్-1 కార్యాలయంలో సంచార న్యాయస్థానం (మొబైల్ కోర్టు) నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజారోగ్య విభాగం అధికారులు నగరంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి, రహదారులపై చెత్తాచెదారం వేయడం, రోడ్లపై పశువులు మరియు పెంపుడు కుక్కలను విచ్చలవిడిగా వదిలేయడం, కాలువల్లో వ్యర్థాలు …

Read More »

సీతమ్మవారి పాదాల వద్ద వినాయక నిమజ్జన ప్రదేశంలో ప్రత్యేక పారిశుధ్య చర్యలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ నిర్మల గౌరీ సూచనలతో శుక్రవారం ఉదయం సీతమ్మవారి పాదాల వద్ద వినాయక నిమజ్జనం నిర్వహించే ప్రదేశంలో పారిశుధ్య, ప్రజారోగ్య విభాగాల సిబ్బంది ప్రత్యేక పారిశుధ్య చర్యలు చేపట్టారు. వినాయక నిమజ్జన కార్యక్రమానికి భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున, నిమజ్జన ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ సిబ్బంది చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రాంగణంలోని …

Read More »

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి – ఎంపీ కేశినేని చిన్ని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితి సందర్భంగా స్పైస్ ఇన్ రెస్టారెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ముఖ్యఅతిథిగా పాల్గొని భక్తులకు మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ, వినాయక చవితి సందర్భంగా విజయవాడ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్లాస్టర్ ఆఫ్ …

Read More »

డీఎస్సీపై వైసీపీ దుష్ప్రచారం మానుకోవాలి – ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)

-డీఎస్సీ ని పూర్తి పారదర్శకంగా నిర్వహించాo విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డీఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. విజయవాడ లోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సాక్షి పత్రికలో ప్రచురిస్తున్న వార్తల్లో వాస్తవాలు లేవని, డీఎస్సీ, ఏపీపీఎస్సీకి తేడా తెలియని వారు కూడా నియామకాలపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.స్పోర్ట్స్ కోటా నిబంధనలపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు అధికారులు ఇప్పటికే స్పష్టమైన వివరణ ఇచ్చారని …

Read More »

రూ.249.50 కోట్లతో 22 కీలక ఆరోగ్య ప్రాజెక్టులు ప్రారంభం

-రేపు కేంద్ర మంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం -10 అత్యవసర చికిత్స కేంద్రాలు.. 12 సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలలు -రాష్ట్రంలో 500 అదనపు అత్యవసర చికిత్స పడకలు అందుబాటులోకి -వ్యాధులను ముందుగానే గుర్తించేందుకు బలమైన పరీక్షా వ్యవస్థ -మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో మెరుగైన వైద్యం అందించడంతోపాటు, వ్యాధులను తొలిదశలోనే గుర్తించి నియంత్రించేందుకు రూ.249.50 కోట్లతో పూర్తి చేసిన 22 కీలక ఆరోగ్య ప్రాజెక్టులను …

Read More »

కూటమి ఐక్యతను ఓర్వలేకే జగన్ ప్రేలాపనలు

-ముందు అసెంబ్లీకి వచ్చే ధైర్యం తెచ్చుకో -డీఎస్సీపై చర్చకు రమ్మంటే ఎందుకు రావడం లేదు? -నాలుగు గోడల మధ్య మైక్ ముందు మాట్లాడేవారిని ఏమనాలి? -అవినీతి సామ్రాట్ జగన్ సిగ్గు గురించి మాట్లాడటం హాస్యాస్పదం -జగన్ వ్యాఖ్యలపై భాజపా జాతీయ నేత, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భాజపా జాతీయ నేత, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ …

Read More »

అమరావతి రైతులకు 28 రిటర్నబుల్‌ ప్లాట్ల కేటాయింపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన పెనుమాక గ్రామానికి చెందిన రైతులకు శుక్రవారం 2026 సెప్టెంబర్ 11న రాయపూడిలోని ఏపీ సిఆర్డిఏ కార్యాలయంలో ఈ- లాటరీ విధానం ద్వారా 28 రిటర్నబుల్‌ ప్లాట్లను కేటాయించారు. రాజధాని నిర్మాణానికై ఇటీవల భూములు(జరీబు) ఇచ్చిన రైతులకు, అలాగే గతంలో ప్లాట్లు పొంది..అట్టి ప్లాట్లు వీధి పోటు, కోర్ట్ కేసులు, భూసేకరణ చేయాల్సిన స్థలాలలో ప్లాట్లు పొందిన వారు తెలియజేసిన విజ్ఞప్తులను పరిశీలించి..అర్హులైన రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లను ఈ- లాటరీ ద్వారా ఈ …

Read More »