విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చైత్ర మాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు -2025 పురస్కరించుకొని తేది. 13.04.2025 సాయంత్రం 5 గంటలకు – శ్రీ మల్లేశ్వరస్వామి వారి ఆలయం నుండి దేవ దేవీరిలకు పవిత్ర కృష్ణానదిలో- నదీ విహారం నిర్వహించుటకు ఊరేగింపుగా తీసుకొని వెళ్లే ఉత్సవము ప్రారంభమైనది. వేద మంత్రాలు, మంగళ వాయిధ్యాలు నడుమ స్వామి, అమ్మ వార్లకు నదీ విహారము నిర్వహించటకు మల్లేశ్వర స్వామి ఆలయం నుండి బయలుదేరిన బృందం మహామండపం వద్దనుండి కూచిపూడి నృత్య కళాకారులు, తప్పెట్లు, కోలాటం, భజన సంకీర్తనలతో కోలాహలంగా దుర్గా స్నానఘాట్ చేరింది. పుష్పాలంకరణ చేసిన ఫంటు పై స్వామి, అమ్మవార్లను అధిరోహింపజేసిన అనంతరం కృష్టానదిలో నదీవిహారం ప్రారంభం అయింది. కళ్యానోత్సవ ఆది దంపతులను కృష్ణా నదిలో విహరింపజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచార్య శ్రీ వి.శివ ప్రసాద్ శర్మ, దేవస్థానం కార్యనిర్వాహక ఇంజనీర్ వైకుంఠరావు, దేవస్థానం ప్రజా సంబంధాల అధికారి కొచ్చెర్ల గంగాధర్,ఆలయ పర్యవేక్షకులు నరసింహరాజు, చందు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
