Breaking News

ఆర్యవైశ్యుల అండ బోండా ఉమానే.. వెల్లంపల్లివి అవాకులు చెవాకులు!.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు,పై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేస్తున్న వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్, తెలుగుదేశం పార్టీకి చెందిన ఆర్యవైశ్య నాయకులు తీవ్రంగా ఖండించారు. సోమవారం అజిత్ సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు జరిగిన పాత్రికేయులు సమావేశంలో వారు మాట్లాడుతూ… పారదర్శకమైన డీఎస్సీ నియామకాలను అడ్డుకుంటూ గంజాయి బ్యాచ్‌ తో రహదారులపై ట్రాఫిక్ జామ్‌లు సృష్టిస్తున్న వారిని ధర్నాచౌక్‌కు వెళ్లమని కోరడమే బోండా ఉమా, చేసిన తప్పా అని వారు ప్రశ్నించారు. గతంలో వెల్లంపల్లి శ్రీనివాస్ మంత్రిగా ఉన్నప్పుడు పశ్చిమ నియోజకవర్గంలో ఆర్యవైశ్యులు నిర్వహించుకునే సత్యనారాయణ స్వామి వ్రతాలు అమ్మవారి పూజలను అడ్డుకున్నారని మండిపడ్డారు.
ఆ సమయంలో బోండా ఉమా, తన స్వంత కళ్యాణ మండపాన్ని ఉచితంగా ఇచ్చి వేలాది మంది పేద ఆర్యవైశ్యులకు అండగా నిలిచారని గుర్తు చేశారు. ఆర్యవైశ్య సంఘ ప్రమాణ స్వీకార కార్యక్రమాలపై దాడులు చేయించి 11 నుండి 16 మంది ఆర్యవైశ్యులపై అక్రమ కేసులు బనాయించిన చరిత్ర వెల్లంపల్లిదని వారు ఆరోపించారు. 70 వేల ఓట్ల మెజారిటీతో ప్రజలే బుద్ధి చెప్పారు.
పశ్చిమ నియోజకవర్గం నుంచి సెంట్రల్‌కు తరిమివేసినా అక్కడ కూడా ప్రజలు వెల్లంపల్లిని తిరస్కరించి బోండా ఉమామహేశ్వరరావును 70 వేల పైచిలుకు మెజారిటీతో గెలిపించారని వారు గుర్తు చేశారు. ఓటమి భారంతోనే ఇప్పుడు కులం పేరుతో రాజకీయాలు చేస్తూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఎక్కడో గుంటూరు ప్రకాశం జిల్లాల నుంచి నాయకులను తెచ్చుకుని వీడియోలు పెట్టించుకోవాల్సిన కర్మ వెల్లంపల్లికి పట్టిందని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు పెద్దపీట ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆర్యవైశ్యుల గౌరవానికి పెద్దపీట వేస్తోందని నాయకులు పేర్కొన్నారు. అందులో భాగంగానే అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతివనానికి 6.8 ఎకరాల స్థలం కేటాయించడం వాసవి మాత జన్మస్థలమైన పెనుగొండకు వాసవి పెనుగొండ గా నామకరణం చేయడం.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన ఆర్యవైశ్యులకు తగినన్ని సీట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం వంటి అంశాలను వారు ప్రస్తావించారు.
ఇకనైనా వెల్లంపల్లి శ్రీనివాస్ తన తీరు మార్చుకోవాలని లేనిపక్షంలో ఆయన ఇంటి ముందే ఆర్యవైశ్యులకు ఆయన చేసిన అన్యాయంపై నిలదీస్తామని నాయకులు హెచ్చరించారు. ఆర్యవైశ్యుల జోలికి రావాలంటే ముందు బోండా ఉమాను దాటుకుని రావాలని వారు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కొనిజేటి రమేష్, కొత్త ముక్తేశ్వరావు, సిఎల్ అరుణ్, గుప్త, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *