-ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పట్టాభిరామ్, ఎమ్మెల్యే గద్దె
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఇంటింటికీ తెలుగుదేశం – 2 ఏళ్ల నమ్మకం’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. టీటీడీ అధికార ప్రతినిధి, స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్దె రామమోహన్ రావుతో కలిసి విజయవాడ 13వ డివిజన్లో సోమవారం ఉదయం ఇంటింటికి వెళ్లి ప్రజలను పలకరించారు. లక్ష్మీపతి నగర్ టిఫిన్ బండి దగ్గర నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో సాధించిన ప్రగతిని, సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించారు. పండుగ వాతావరణంలో సాగుతోన్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు గడపగడపకు వెళ్లి, ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్త్రీశక్తి, తల్లికి వందనం, పింఛన్ పెంపు, రైతు సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. రెండేళ్లలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, వివిధ వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధుల వివరాలను తెలియజేసే ప్రచార పత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ, ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ‘సూపర్ సిక్స్’ హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేసినట్లు చెప్పారు. అనేక సంక్షేమ పథకాల ద్వారా పేదలకు అందుతున్న ప్రయోజనాలను ఆయన వివరించారు. టీడీపీని బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని పట్టాభిరామ్ పిలుపు ఇచ్చారు. కష్టపడిన ప్రతి కార్యకర్తను పార్టీ గుర్తిస్తుందని, అటువంటివారికి మంచి భవిష్యత్ ఉంటుందని పట్టాభిరామ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ ముమినేని ప్రసాద్, టీడీపీ నేత గద్దె ప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యాయ సంఘ నాయకులు చలసాని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News