Breaking News

నరసాపురం క్రోచెట్ లేస్ కళాకారులకు ఉచిత కళ్లజోళ్ల పంపిణీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో నరసాపురం నియోజకవర్గ పరిధిలోని 141 మంది క్రోచెట్ లేస్ హస్తకళాకారులకు ఉచితంగా కళ్లజోళ్లు అందజేశారు. శనివారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే శ్రీ బొమ్మిడి నాయకర్ చేతుల మీదుగా లేసు కళాకారులకు ఈ కళ్లజోళ్లను పంపిణీ చేశారు. విజయవాడలో జరిగిన హస్తకళా మహోత్సవం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  హస్తకళాకారులందరికీ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య సమస్యలను గుర్తించి అవసరమైన సహాయం అందించాలని సూచించారు. ఆ ఆదేశాల మేరకు గత నెలలో నరసాపురంలో క్రోచెట్ లేస్ కళాకారుల కోసం నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకున్న వారిలో 141 మందికి కళ్లజోళ్లు అవసరమని వైద్యులు గుర్తించారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి అవసరమైన 141 మంది కళాకారులకు ఉచితంగా కళ్లజోళ్లు ఏర్పాటు చేశారు. కళాకారులకు అందించే కళ్లజోళ్ల నాణ్యత విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న  పవన్ కళ్యాణ్, మంగళగిరి క్యాంపు కార్యాలయంలో స్వయంగా పరిశీలించిన అనంతరం కళాకారులకు పంపించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *