Breaking News

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖరారు చేసిన ధరకు పొగాకు కొనుగోళ్లు జరగాల్సిందే

-కొనుగోళ్ల ప్రక్రియలో పొగాకు బోర్డు అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి
-రైతుల ప్రయోజనాల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్నీ ఉపేక్షించేది లేదు
-పొగాకు రైతులకు న్యాయం చేసేందుకు సీఎం చం
ద్రబాబు అన్ని విధాల కృషి చేస్తున్నారు
-మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పొగాకు రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. గుంటూరులోని పొగాకు బోర్డు కార్యాలయంలో ఎఫ్‌సీవీ పొగాకు కొనుగోళ్లు, ధరలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, కింజరాపు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి ర‌వికుమార్, పొగాకు పండించే ప్రాంతాల శాసనసభ్యులు, పొగాకు బోర్డు చైర్మన్, ఈడీ, కొనుగోలు సంస్థల ప్రతినిధులు, వివిధ ప్రాంతాల రైతులతో సుమారు రెండు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు. రైతుల సమస్యలు, కంపెనీల కొనుగోలు తీరు, ధరల అమలుపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగినట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ…..గుంటూరు టొబాకో బోర్డులో సహచర మంత్రులు శ్రీ అచ్చెన్నాయుడు గారు, శ్రీ గొట్టిపాటి రవి గార్లతో కలిసి పొగాకు రైతులు, కొనుగోలు వ్యాపారులు, పొగాకు బోర్డు అధికారులతో సమావేశమై పొగాకు కొనుగోళ్ల పరిస్థితిపై సమీక్ష నిర్వహించాం. రైతులకు న్యాయం జరిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖరారు చేసిన ధరకు పొగాకు కొనుగోళ్లు జరగాలని స్పష్టం చేశాం. ఇప్పటికే కుదిరిన ఒప్పందాలను వ్యాపారులు తప్పనిసరిగా గౌరవించాలని, కొనుగోళ్ల ప్రక్రియలో పొగాకు బోర్డు అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించాం. రైతులకు కనీస మద్దతు ధర దక్కేలా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది. రైతుల ప్రయోజనాల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్నీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశాం.రైతు సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. వ్యవసాయ శాఖ, పొగాకు బోర్డు సమన్వయంతో తక్షణమే కార్యాచరణ చేపట్టి బోర్డు అనుమతితో పొగాకు సాగు చేసిన రైతులతో పాటు అనుమతి లేకుండా సాగు చేసిన రైతులు, కౌలు రైతులు సహా అర్హులైన ప్రతి పొగాకు రైతుకు రూ.50 వేల చొప్పున రెండు సంవత్సరాల వడ్డీలేని రుణం అందించేలా చర్యలు చేపడుతున్నామని మంత్రి వెల్లడించారు. లో గ్రేడ్ పొగాకు క్వింటా రూ.1000 రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తోంది. రైతులకు ఎప్పుడు కష్టం వచ్చినా అండగా నిలబడింది టీడీపీనే. 2015లో పొగాకు రైతులకు వయాబులిటీ గ్యాప్ ఫండ్ ఇచ్చి ఆదుకున్నాం. గతేడాది రూ.300 కోట్లతో బర్లీ పొగాకు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచాం. కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *