విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం అంటేనే వెల్లంపల్లి శ్రీనివాస్ బ్రాండ్ అని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి షేక్ బాజీ బాబా, రాష్ట్ర వైఎస్ఆర్సిపి సంయుక్త కార్యదర్శి షేక్ హయాత్, 53వ డివిజన్ అధ్యక్షుడు గురు మహంతు మహేష్ అన్నారు. మంగళవారం వన్ టౌన్ రాయల్ హోటల్ దగ్గర ఖాన్ దర్బార్. సోల్జర్ ఆఫీస్ వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పై టిడిపి నేతలు చేస్తున్నఅనుచితవ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం అంటేనే వెల్లంపల్లి శ్రీనివాస్ బ్రాండ్ అంబాసిడర్ అని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని కళ్ళకు కట్టినట్లు చూపిస్తాం చూపిస్తామని ఈ సందర్భంగా వారు అన్నారు. టిడిపి కార్యాలయం ఉన్న గణపతిరావు రోడ్డును అభివృద్ధి చేసింది కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ అనే ఆ విషయాన్ని టిడిపి నేతలు తెలుసుకొని మాట్లాడాలి అన్నారు. టీడీపీ హయాంలో గడిచిన రెండేళ్ల కాలంలో ఒక్క శంకుస్థాపన కూడా చేయలేదు అని. వైఎస్ఆర్సీపీ హయాంలో మేము చేసిన పనులనే ఇప్పుడు అభివృద్ధిగా చెప్పుకుంటు కాలయాపన చేస్తున్నారన్నారు. పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని ఈ సందర్భంగా వారు సవాల్ విసిరారు. ఈ సమావేశంలో రాష్ట్ర బొందలి అధ్యక్షుడు నరేంద్ర సింగ్, ఎన్టీఆర్ జిల్లా మైనారిటీ అధ్యక్షుడు షేక్ మస్తాన్, రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి సోల్జర్, సహాయ కార్యదర్శి షేక్ నజీర్, .పశ్చిమనియోజకవర్గం మహిళాఅధ్యక్షురాలు పేరూరి దుర్గ భవాని, ఎన్టీఆర్ జిల్లా మహిళా ఎగ్జిక్యూటివ్ నెంబర్ ఆర్కే రెడ్డి, 54వ డివిజన్ అధ్యక్షుడు షేక్ అప్సర్, 51 వ డివిజన్ అధ్యక్షుడు తుపాకుల గురుమూర్తి రెడ్డి. అలీ. మహిళా నాయకురాలు బంక లక్ష్మి, కనకలక్ష్మి, ఎన్ దుర్గాభవాని తదితర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News