Breaking News

ఢిల్లీ లేపాక్షి షోరూమ్‌ను సందర్శించిన చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్

-వ్యాపారాన్ని పది రెట్లు పెంచేలా సమగ్ర మార్కెటింగ్ వ్యూహం రూపొందించాలి

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్, గత నెల 17వ తేదీన పునఃప్రారంభించిన ఢిల్లీలోని లేపాక్షి షోరూమ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా షోరూమ్‌లో కొనసాగుతున్న వ్యాపార కార్యకలాపాలు, విక్రయాలు, ఉత్పత్తుల ప్రదర్శన, మార్కెటింగ్ విధానం, భవిష్యత్ వ్యాపార అవకాశాలపై సిబ్బందితో సమీక్ష నిర్వహించారు.
ఢిల్లీలోని లేపాక్షి షోరూమ్‌ను కేవలం విక్రయ కేంద్రంగా కాకుండా, ఆంధ్రప్రదేశ్ హస్తకళా ఉత్పత్తులకు జాతీయ స్థాయి ఎగ్జిబిషన్ మరియు ప్రమోషన్ సెంటర్‌గా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ సూచించారు. ముఖ్యంగా వందల సంఖ్యలో ఉత్పత్తులను ఒకేసారి ఆర్డర్ చేసే సంస్థలు, ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, అంతర్జాతీయ కేంద్రాలు, సమావేశాలు, సదస్సులు, అధికారిక కార్యక్రమాలు తదితరాలకు గిఫ్ట్ ఐటమ్స్‌గా అందించే విధంగా ప్రత్యేక మార్కెటింగ్ వ్యవస్థను రూపొందించాలని సూచించారు. అందుకు అనుగుణంగా హస్తకళా ఉత్పత్తులకు ఆకర్షణీయమైన, నాణ్యమైన మరియు ప్రమాణాలకు అనుగుణమైన ప్యాకింగ్ వ్యవస్థను అభివృద్ధి చేసి, బల్క్ ఆర్డర్లను స్వీకరించే విధంగా ప్రత్యేక ప్యాకేజింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు, వివిధ జాతీయ స్థాయి సమావేశాలు, కాన్ఫరెన్సులు, బిజినెస్ మీటింగ్స్ మరియు ఇతర ముఖ్యమైన కార్యక్రమాల్లో లేపాక్షి హస్తకళా ఉత్పత్తులను గిఫ్ట్ ఆర్టికల్స్‌గా మార్కెట్ చేసే అవకాశాలను విస్తృతంగా వినియోగించుకోవాలని చైర్మన్ సూచించారు. ఈ విధానం ద్వారా ఆంధ్రప్రదేశ్ కళాకారులు తయారు చేస్తున్న హస్తకళా ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభించే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా ఢిల్లీ లేపాక్షి షోరూమ్‌కు IIM వంటి ప్రముఖ మేనేజ్‌మెంట్ సంస్థకు చెందిన నిపుణుడిని లేదా మార్కెటింగ్ నిపుణుడిని ప్రత్యేకంగా నియమించి, వారి ఆధ్వర్యంలో సమగ్ర మార్కెటింగ్ మరియు బిజినెస్ డెవలప్‌మెంట్ ప్రణాళికను రూపొందించాలని సూచించారు. ఉత్పత్తుల ప్రకటనలు, డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా ప్రమోషన్స్, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఉత్పత్తుల విక్రయాలు, ఆన్‌లైన్ ఆర్డర్ల స్వీకరణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.
విజయవాడ, హైదరాబాద్, తిరుమలలోని లేపాక్షి షోరూమ్‌లు సాధిస్తున్న వ్యాపార స్థాయికి అనుగుణంగా ఢిల్లీ షోరూమ్‌ను కూడా అభివృద్ధి చేసి, భవిష్యత్తులో నెలకు దాదాపు రూ. కోటి లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం సమకూర్చే ప్రధాన విక్రయ కేంద్రంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. లేపాక్షి హస్తకళా ఉత్పత్తులను ఢిల్లీ వేదికగా దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేసి, ఆంధ్రప్రదేశ్ కళాకారుల నైపుణ్యానికి మరింత మార్కెట్ కల్పించడంతో పాటు సంస్థ ఆదాయాన్ని గణనీయంగా పెంచేలా చర్యలు చేపట్టాలని చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *