అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ కౌన్సిల్ అదనపు కార్యదర్శి పంకజ్ కుమార్ సింగ్, సంయుక్త కార్యదర్శి డి.పి.మిశ్రాలు సందర్శించారు. ఆర్టీజీఎస్ పనితీరు గురించి డేటా డ్రివన్ గవర్నెన్స్, డేటాలేక్, ఏఐ వినియోగం, అవేర్ తదితర విభాగాలు పని చేస్తున్న తీరును తెలుసుకున్నారు. ఆర్టీజీఎస్ అద్భుతంగా ఉందని, ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమీషనర్ బాబు ఏ వారితో పాటు ఉన్నారు.
Prajavartha Online Telugu News