-26 రకాల మొక్కలతో సుందరీకరణ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాజధాని అమరావతి ప్రధాన మార్గమైన సీడ్ యాక్సెస్‌రోడ్డును ప్రారంభోత్సవానికి అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తోంది. ఈ నెల 13వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యుల చేతుల మీదు ఈ రహదారిని సీఎం చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించనున్న తరుణంలో వివిధ రకాల అందమైన మొక్కలు, చెట్లను ఏడీసీ సీఎండీ శ్రీమతి డి.లక్ష్మీపార్థసారథి వారి ఆదేశాలను పాటిస్తూ గ్రీనరీ విభాగం అధికారులు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో కడియం ప్రత్యేకంగా నర్సరీల నుంచి తీసుకువచ్చిన గోల్డెన్ నీమ్, ప్లుమేరియా రుబ్రా ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి. వీటిని ఉండవల్లిలోని స్టీల్ బ్రిడ్జి దగ్గర నుంచి గుంటూరు ఛానెల్, కొండవీటివాగులపై నిర్మిస్తున్న మేజర్ స్టీల్ బ్రిడ్జి వరకు రహదారి మధ్యలో నాటుతున్నారు. అంతేకాకుండా ఉండవల్లి వద్ద బకింగ్‌హాం కెనాల్‌కు ఇరువైపులా ఉన్న రోటరీ భాగాలలో మరో 21 రకాల మొక్కలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో మంచి ఆక్సిజన్‌తో పాటు చక్కటి నీడనిచ్చే స్టెర్క్యూలియా అలాటా, స్పైడర్ లిల్లీ,
జెఫిరాంథస్ (వర్షపు), లిల్లీ సింగోనియం, నల్ల ఫౌంటెన్ గడ్డి, ల్యూకోఫిల్లమ్, సాంగ్ ఆఫ్ ఇండియా, క్రాసాండ్రా, రుసెలియా రెడ్, ఫెర్న్‌లు, టెకోమా కాపెన్సిస్ న్యూ పింక్, అల్పినయా, టెకోమా కాపెన్సిస్ (ఆరెంజ్), కలాథియా,
బాటిల్ బ్రష్ డ్వార్ఫ్, చైనా డాల్, క్లూసియా రోసియా, జాట్రోఫా రెడ్, హెలికోనియా రెడ్, య్లాంగ్ య్లాంగ్, ఫ్లోరిడా ఫిడిల్ వుడ్, బ్లాక్ లోకస్ట్ వంటి అధునాతనమైన మొక్కలను రోటరీలో వేస్తున్నారు. కెనాల్‌కు ఇరువైపులా ల్యాండ్ స్కేపింగ్ చేయించి పచ్చటి గ్రాస్‌వేసి వాటి మధ్య మొక్కలు వేస్తున్నారు.
ఇవే కాకుండా అనంతవరంలోని ఏడీసీ ట్రాన్స్‌లొకేషన్‌లో సంరక్షిస్తున్న బహుళ వృక్షాలను భారీ క్రేన్ల సహాయంతో బ్యూటిఫికేషన్ చేస్తున్నారు. గ్రీనరీ ఏర్పాట్లతో ఈ ప్రాంతం ముచ్చటగొల్పతుంది.
Prajavartha Online Telugu News