విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్ జేఏసీ అత్యవసర సమావేశం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం సమావేశం ది.19-08-2026 బుధవారం విజయవాడలో నిర్వహించడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు. భూపతిరాజు రవీంద్ర రాజు అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్ జేఏసీ ప్రధాన కార్యదర్శి బి. మధుబాబు, రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అప్పలనాయుడు తెలియజేశారు. ఈ రాష్ట్రంలో వీఆర్ఏ, విఆర్ఓ, సర్వేర్ల సమస్యలపై ఎన్నోసార్లు రాష్ట్ర ఉన్నతాధికారులకు, రెవెన్యూ మంత్రికు తెలియజేసిన ఇప్పటివరకు సమస్యలు పరిష్కారం కొరకు చర్యలు తీసుకోపోవడంతో ఇప్పటికే విఆర్ఏల జేఏసీ నేతలు అందరూ కలిసి ఆందోళనకు పిలుపునివ్వడం జరిగిందని, దానిలో భాగంగా ఈరోజు 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. దానికి అమరావతి రెవిన్యూ ఎంప్లాయిస్ జేఏసీ మద్దతు ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే ఈ నెల 17, 18, 19 తేదీల్లో సీసీఎల్ఏ కార్యాలయం వద్ద వీఆర్ఏలు నిర్వహించే రిలే నిరాహార దీక్ష లకు చలో సీసీఎల్ఏ కార్యక్రమానికి అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్ జేఏసీ మద్దతు ప్రకటించడం జరిగిందన్నారు. ఈ నెల 19వ తేదీన న సిసిఎల్ ఏ కార్యాలయం వద్ద నిర్వహించే నిరసన కార్యక్రమంనకు, మద్దతు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవిన్యూ ఎంప్లాయిస్ జేఏసీ నాయకులు అందరూ పాల్గొనాలన్నారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు, అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు కూడ తప్పనిసరిగా పాల్గొనాలన్నారు. అక్కడే అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్ జేఏసీ సమావేశం ఏర్పాటు చేసుకుని వీఆర్ఏ, వీఆర్వో, సర్వేర్ల సమస్యలపై చర్చించి ఉమ్మడి కార్యచరణ ప్రకటించడం జరుగుతుందని పత్రికా ప్రకటన ద్వారా ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ భూపతిరాజు రవీంద్ర రాజు. ప్రధాన కార్యదర్శి బి. మధుబాబు తెలియజేశారు.
Tags vijayawada
Check Also
చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …
Prajavartha Online Telugu News