అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ,సచివాలయ భవనాలను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ప్రతిబింబించేలా సచివాలయంలోని ఐదు భవనాలను ప్రత్యేక విద్యుత్ దీపాలతో తీర్చిదిద్దారు.అసెంబ్లీ భవనాన్ని సైతం వివిధ రకాల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించడంతో భవన సముదాయం విద్యుత్ కాంతులతో మిరుమిట్లు గొలుపుతోంది.అసెంబ్లీ,సచివాలయ ప్రాంగణాల్లోని రహదారులకు ఇరువైపులా, సెంట్రల్ పార్కులో వివిధ రంగులతో కూడిన ప్రత్యేక విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు.దీంతో మొత్తం ప్రాంగణం విద్యుత్ వెలుగులతో శోభాయమానంగా మారి పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా విజయవాడలోని లోక్ భవన్,ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం,ప్రకాశం బ్యారేజ్,ప్రఖ్యాత ఉండవల్లి గుహలు,ఇతర చారిత్రక ప్రాముఖ్యత కలిగిన భవనాలు, ప్రముఖ కట్టడాలను సైతం విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఈ ప్రత్యేక విద్యుత్ అలంకరణలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ, సచివాలయ భవనాలకు మరియు నగరానికి మరింత శోభను తీసుకువచ్చాయి.
Prajavartha Online Telugu News