Breaking News

హోళి పండుగ ప్రజల జీవితాలలో రంగుల హరివిల్లు నింపాలి..

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
హిందువులు సాంప్రదాయంగా పాల్గుణ పౌర్ణమి రోజున జరుపుకునే రంగుల ఉత్సవం హోళి పండుగ ప్రజల జీవితాలలో అనందమయ రంగుల హరివిల్లులను నింపాలని కోరుతున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు తెలిపారు.హోళి పండుగను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు, ఆయన ప్రశాంతి, తల్లి పార్వతి, కుమారుడు జివితేష్‌, కుమారై సిరి చందన, ఇతర బంధువులు సిబ్బందితో కలిసి నగరంలోని ఆయన నివాసంలో ఆనందోత్సవాల నడుమ హోళి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మట్లాడుతూ శ్రీ కృష్ణ భగవానుడికి ప్రీతి పాత్రమైన హోళి పండుగను మధుర, బృందావనం, నందగావ్‌ బర్సానాలలో ఘనంగా జరుపుకుంటారన్నారు. హోళి ఉత్సవం రోజు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా కుటుంబ సభ్యులు బంధు మిత్రులు సేహ్నితులు అందరూ రంగులు జల్లుకుంటూ ఆనందంగా జరుపుకుంటారన్నారు. టమాట, క్యారెట్‌ రసాల నీటిలో సేంద్రీయ రంగులను కలిపి సహజసిద్దంగా హోళి వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. వసంత కాలంలో వాతావరణంలో కలిగే మార్పులు వలన విష జ్వరాలు సంభవిస్తాయని సహజసిద్దమైన రంగు పొడులను జల్లుకోవడం వలన ఔషదంగా పనిచేస్తాయని పెద్దలు నమ్మకం అన్నారు. గతంలో వ్యాధినిరోధక శక్తికి ఉపయోగపడుతుందని నమ్మకంతో సహజసిద్దమైన రంగులలో నిమ్మ, పసుపు, కుంకుమ, బిల్వ పత్ర పొడులను మోదుగ పుష్పలను ముందురోజు నీటిలో నానబెట్టి వాటిని హోళి ఉత్సవంలో జల్లుకునేవారని అటువంటి సాంప్రదాయాన్ని నేటి తరం పాటించాలని కలెక్టర్‌ డిల్లీరావు కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *