Breaking News

జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తూర్పు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్  పాల్గొని నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా కార్పొరేటర్లు నిర్మలాకుమారి,భిమిశెట్టి ప్రవల్లిక,దుర్గ గుడి మెంబెర్ బచ్చు మాధవి,మహిళా నాయకులు ఇందుపల్లి సుభాషిణి,తుంగం జాన్సీ లతో కలిసి కేక్ కట్ చేపించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ సందర్భంలో అవినాష్ మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో మహిళలకు నేరుగా సంక్షేమ లబ్ది అందజేయడంతో పాటు, వారికి రాజకీయ పదవులలో అధిక ప్రాధాన్యత కల్పిస్తూ సామాజిక,ఆర్థిక గౌరవం కల్పించిన ఘనత ,మహిళా పక్షపాతి మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మహిళలు ఇంటికి పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసిందన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *