Breaking News

పేదలకు వరంలా మారిన ముఖ్యమంత్రి సహాయనిధి(LOC) పథకం:దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో నిరుపేదల వైద్య చికిత్స కొరకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరం ల సహాయపడుతుంది అని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు.బుధవారం తూర్పు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 13వ డివిజన్,ఎలక్ట్రసిటీ కాలనీ కి చెందిన ఏరుకుపాటి రాజేష్ కుమారుడు జెస్వంత్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ వైద్యానికి ఆర్థిక సహాయం కోసం తక్షణమే ఒక్క రోజులో ముఖ్యమంత్రి సహాయనిధి(LOC) ద్వారా 10,00,000/- రూపాయలు మంజూరు చేపించి ముఖ్యమంత్రి సహాయనిధి మంజూరు పత్రం (LOC) లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఏ పేదవాడు నాణ్యమైన వైద్యానికి దూరం కాకూడదని స్వర్గీయ వై.యస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకాన్ని మరింత ఆధునికరించి వెయ్యి రూపాయలు దాటిన ప్రతి వైద్య పరీక్షను ఆ పధకం ద్వారా వర్తించేలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మార్పులు చేసారని,ఏదైనా వైద్య సేవలు ఆ పధకం కిందకు రాకుంటే వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది అని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *