Breaking News

మహిళల నిర్ణయాలను మనం గౌరవించాలి : జిల్లా కలెక్టర్

తిరుపతి,నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశంలో వేద కాలం , పురాణ కాలాలలో మహిళలు అన్ని రంగాలలో గౌరవింపబడే వాళ్ళని, మధ్యయుగంలో మహిళల ప్రాధాన్యత తగ్గడం , అనంతరం మనకు స్వాతంత్రం వచ్చిన తరువాత బిఆర్ అంబేద్కర్ సమానత్వం కోసం రాజ్యాంగంలో అనేక ఆర్టికల్స్ మహిళల కోసం సమానత్వం కల్పించడంతో పురాణ , వేద కాలం నాటి మహిళలకు వున్న గౌరవం నేడు మహిళలకు దక్కుతున్నదని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి అన్నారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా బుధవారం ఉదయం స్థానిక న్యూ బాలాజీ కాలనీలో మేక్ మై బేబీ జీనియస్ స్కూల్ ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్ ఎంప్లాయిస్ మహిళా విభాగం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ఆరోగ్య విషయాలపై దృష్టి పెట్టాలని అప్పుడే విద్యలోనూ, ఆర్థికంగా కుటుంబం , సమాజం బల పడుతుందని అన్నారు. మహిళలు ఆర్థికంగా బలపడి ఇంటికే పరిమితం కాకుండా ఇంటి పనులతో పాటు ఆర్థిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల పని భారం పెరుగుతుందని అందుకే తప్పనిసరి మొదటి ప్రాధాన్యత మహిళలు ఆరోగ్యం పై శ్రద్ధ చూపాలని అన్నారు. తిరుపతి జిల్లా ఏర్పడిన 9 నెలల కాలంలో మెడికల్ రికార్డుల మేరకు జిల్లాలో రెండింత 3 వంతు అంటే దాదాపు 12 లక్షల మందికి క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయని గుర్తించడం జరిగిందని, అందులో మహిళ లు 45 సంవత్సరాల పైబడిన వారికి 80% మందికి క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయని అన్నారు. ఆసుపత్రుల్లో వైద్యం కోసం వస్తున్న వారు రెండు , మూడు దశలలో రావడం జరుగుతున్నదని అది ప్రమాద స్థాయి అన్నారు. మొదటి దశలోనే గుర్తించడానికి తిరుపతి జిల్లా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి , సంవత్సరములోపు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మొదట పైలెట్ ప్రాజెక్టుగా తిరుపతి , విశాఖపట్నం లను ఎంపిక చేసిందని త్వరలో కార్యచరణ అమలు కానున్నదని అన్నారు. అన్ని శక్తులు మహిళల్లో ఉన్నాయని గ్రహించాలని పిల్లలకు భయం కాదు గౌరవం నేర్పించాలని రేపటి తరానికి ఆదర్శంగా నిలిచేలా అన్ని రంగాల్లో అంటే క్రీడా విద్య వైద్య సాంకేతిక ఐటి లో సమానత్వం కల్పించాలని అన్నారు. ప్రస్తుత ప్రధాన సమస్య మహిళలలో గర్భిణీ స్త్రీలలో అధిక రక్తహీనత ఉందని తప్పనిసరి ప్రభుత్వం అందిస్తున్న గోరుముద్ద పౌష్టికాహారం వంటివి పొంది బయటపడాలని సూచించారు. బాల్యవివాహాల వల్ల 16 సంవత్సరాల లోపు గర్భవతులు హై రిస్క్ గర్భవతులుగా నమోదవుతున్నారని, ఎట్టి పరిస్థితుల్లో బాల్యవివాహాలు వద్దని , దాచిపెట్టరాదని తల్లిదండ్రులకు సూచిస్తున్నామని అన్నారు. గత నాలుగు నెలలలో హై రిస్క్ గర్భవతులను ప్రసవ సమయానికి ఏడు రోజులు ముందే ప్రభుత్వమే ఆసుపత్రులకు తరలించి వైద్యం అందించడం వల్ల మరణాలు లేవని శుభపరిణామమని అన్నారు.మహిళలను ప్రోత్సహించే కార్యక్రమాలు తరచు నిర్వహించేలా డిఆర్డిఏ ,మెప్మా , ఐసిడిఎస్ సంయుక్తంగా నిర్వహించాలని సూచించారు.మొదట గా అంతర్జాతీయ మహళా దినోత్సవ వేడుక ల సందర్భంగా గౌ. జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి వారికి క్యూబ్స్ తో ఫోటో ఫ్రేమ్ మహిళల అద్భుత బహుమతితో స్వాగతం పలికారు.సమావేశ అనంతరం వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన మహిళలకు ప్రశంసా పత్రాలను అందించి సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఎన్జీవో సంఘాల నాయకులు ఉద్యోగులు, శాంతి దుర్గ , ప్రసాద్ రావు, రాధమ్మ , జ్యోతి , డాక్టర్ ప్రసన్న, శశికళ ,నాగేశ్వరరావు, లక్ష్మీపతి, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *