విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వాసవ్య మహిళా మండలి నందు ప్రపంచ మహిళా దినోత్సవం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాని ముఖ్య అతిధిగా డాక్టర్ సరస్వతి రాజు అయ్యర్, డీస్, ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు సాంకేతికత పరిజ్ఞానాన్ని కలిగి అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. దీనికి ఇన్నోవేషన్ ఆలోచనలు తోడైతే ఇంకా మంచి ఫలితాలను ఆంశించవచ్చు అన్నారు. గతంతో పోల్చుకుంటే మహిళలలో ఈ కామర్స్ ఉపయోగించడం ఎక్కువ అయిందని సరైన అవగాహన లేకుంటే మోసగాళ్ళ చేతులోకి వెళ్ళే ప్రమాదం ఉందని ఆమె అన్నారు. మహిళలు తలచుకుంటే సాధించలేనిది ఏదిలేదని అందుకు కుటుంబ సహకారం ఎంతోముఖ్యమని ఆమె అన్నారు. లింగ సమానత్వాని కోసం వాసవ్య మహిళా మండలి వారు ఎన్నో కార్యక్రమాలను నిర్వహించారని తద్వారా సమాజంలో మార్పు తీసుకురావడానికి ఎంతగానో సహకారం అందిస్తున్నారని ఆమె అన్నారు. ఏదైనా సమస్య జరిగినప్పుడు “నాకెందుకులే” అని ఆలోచించే ధోరని మారాలని, భాద్యతగా మెలగినప్పుడే సమాజం లో మార్పు వస్తుందని ఆమె అన్నారు. అనంతరం వాసవ్య మహిళా మండలి అధ్యక్ష్యులు డాక్టర్ బి.కీర్తి మాట్లాడుతూ మహిళలు ఆపదలో ఉన్నప్పుడు సాంకేతికత ను ఉపయోగించడం ద్వారా దానిని అధిగమించవచ్చని, రాబోయే కాలంలో రొమ్ము క్యాన్సర్ పై వాసవ్య మహిళా మండలి సాంకేతికత ను ఉపయోగించబోతుందని, ఏ.ఐ తో పనిచేసే శ్వాస అప్లికేషన్ ను ఉపయోగించి మంచి ఫలితాలను రాబడుతున్నామని ఆమె అన్నారు. అనంతరం పలు రంగాలలో సేవలు అందించిన మహిళలను, వారి అభివృద్ధి కి సహకరించిన పురుషుల సందర్భంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి మాజీ మేయర్ తాడి శకుంతల, వాసవ్య మహిళా మండలి కార్యదర్శి జి.రశ్మి, మెడికల్ డైరెక్టర్ పి.దీక్ష, అడ్వకేట్ సుభాషిణి, కె.విజయ మహిళా మిత్ర సభ్యులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News