విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలలో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక వారి రాజకీయ మనుగడ కోసం ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టి ప్రజలకు వాస్తవాలను వివరించే బాధ్యత వైసీపీ సోషల్ మీడియా సైనికులు తీసుకోవాలని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఆదివారం గుణదల తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ కార్యాలయం లో సోషల్ మీడియా శ్రేణులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అవినాష్ భవిష్యత్తు కార్యాచరణ, పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు తదితర అంశాలపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైస్సార్సీపీ పార్టీ స్థాపించిన నాటి నుండి కూడా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారి అభిమానులు, జగనన్న అభిమానులు పార్టీ కోసం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసారని, మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఘన విజయానికి వీరి కృషి అమోఘం అని కొనియాడారు.తూర్పు నియోజకవర్గంలో ప్రతి డివిజన్ లో జరిగిన అభివృద్ధిని ప్రజలలోకి వెళ్లేలా చేయాలన్నరు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లు రాష్ట్రానికి ఏమి చేయకున్న ప్రచారాలు మాత్రం ఘనంగా చేసుకున్నారని, సెల్ఫీ ఛాలెంజ్ ల పేరిట డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ నేత లోకేష్ కు నిజంగా దమ్ముంటే ఒక్కసారి తూర్పు నియోజకవర్గంలో ఏమి చేశారో చెప్పాలని సవాలు విసిరారు. నియోజకవర్గంలో కృష్ణలంక వాసుల రిటైనింగ్ వాల్ గాని,పేదలందరికి సొంతింటి కల సాకారం గాని, కొండప్రాంత అభివృద్ధి గాని వైసీపీ ప్రభుత్వం లోనే జరిగింది అని అన్నారు. నేడు రాష్ట్రంలో పేద ప్రజల బ్రతుకుల్లో వెలుగులు నింపడానికి ముఖ్యమంత్రి జగనన్న ఎంతగా శ్రామిస్తున్నారో మనందరికీ తెలుసు అని, కానీ ప్రజలలో ఆయనను చులకన చేయడానికి, ప్రభుత్వం మీద బురద జల్లడానికి ఎల్లో మీడియా తో జతకలిసి ప్రతిపక్ష పార్టీలు, వారి అనుకూల సోషల్ మీడియాలలో దుష్ప్రచారం చేస్తూ ప్రజలలో విష బీజాలు నాటే కార్యక్రమం చేపట్టారని విమర్శించారు. కానీ మనకు అంత మీడియా బలం లేకున్నా ప్రజలకు చేస్తున్న మంచిని మన సోషల్ మీడియా ద్వారా వారికి చేరువ చేసి మరలా పార్టీ అధికారంలోకి వచ్చేలా కృషి చేద్దామని అవినాష్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ పిల్లి వెంకట్,కో -కన్వీనర్లు జావీద్ ఖాన్,సాయి మరియు వైస్సార్సీపి సోషల్ మీడియా సభ్యులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News